విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాసవ్య మహిళా మండలి ఆధ్వర్యంలో ఆటోనగర్ నాలుగవ క్రాస్, ఐదవ రోడ్డు నందు 21 రోజుల క్షయ వ్యాధి అవగాహనా శిభిరాలను సి.హెచ్. దినేష్, జిల్లా క్షయ వ్యాధి నియంత్రణా సమన్వయకర్త ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోనగర్ కార్మికులు ఆరోగ్యం కొరకు వాసవ్య మహిళా మండలి క్షయ పై అవగాహనా శిబిరాలను ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయం అని, క్షయవ్యాధి లక్షణాలైన రొండు వారాలకు మించి దగ్గు, ఆకలి లేకపోవడం, బరువు కోల్పోవడం, తరచూ జ్వరం రావడం లోని ఏఒక్కటి ఉన్నా ఆలస్యం చేయకుండా దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రం కు గాని గవర్నమెంటు ఆసుపత్రికి గాని వెళ్ళి పరీక్ష చేయించుకోవాలని, ఒక వేల క్షయ గా నిర్ధారణ అయితే గవర్నమెంటు వారు ఉచితంగా మందులు, పోషకాహారం కొరకు ఆరు నెలల పాటు 500 వందల రూపాయలను ఇస్తారని, కావున క్రమం తప్పకుండా మందులను తీసుకుంటే వ్యాధి తగ్గుతుందని ఆయన అన్నారు. గోరు, వెంట్రుక కు తప్ప శరీరంలో ఏ అవయవాన్నికైన క్షయ వ్యాధి సోకి ప్రమాదముందని, వ్యాధిసోకిన వ్యక్తి మాట్లాడే సమయంలో, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఇతరులకు సులభంగా వ్యాధి సోకే ప్రమాధముందని కనుక దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన ను కలిగి ఉండాలని ఆయన అన్నారు. క్షయవ్యాధి ని అంతమొందించేందుకు ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలని ఆయన అన్నారు.
ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా 21 రోజుల పాటు ఈ రోజు నుండి మార్చి నెల 20 వరకు వివిధ కూడలిలో సిబ్బంది ఆటోనగర్ లోని కార్మికులకు ఫ్లిప్ చార్ట్, పాంప్లేట్స్ ద్వారా అవగాహన కల్పిస్తూ లక్షణాలున్న వారికి పరీక్ష ఉచితంగా చేయిస్తామని, క్షయ గా నిర్ధారణ అయితే ఉచితంగా చికిత్సను గవర్నమెంట్ వారి సహకారంతో అందిస్తామని ఆయన అన్నారు.