విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహా శివ రాత్రి మహోత్సవాల సందర్భంగా కమీషనరేట్ నందు క్షేత్రస్థాయిలో చేసిన బందోబస్త్ ఏర్పాట్లును నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్., స్వయంగా పర్యవేక్షించారు. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్. ఇతర పోలీస్ అధికారులతో కలిసి నగరం లో పుణ్య స్నానాలు చేయు ప్రదేశాల అయిన దుర్గా ఘాట్, పున్నమి ఘాట్, భవానిఘాట్, పవిత్ర సంగమం మొదలైన ఘాట్లను, క్యూ లైన్లు మరియు శివాలయాల వద్ద క్షేత్రస్థాయిలో చేసిన బందోబస్త్ ఏర్పాట్లను తెల్లవారుజాము నుండి స్వయంగా పర్యవేక్షించి భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకునే విధంగా, భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేవిధంగా చూడాలని బందోబస్తులో ఉన్న అధికారులను మరియు సిబ్బందిని అప్రమత్తం చేస్తూ తగు సూచనలు చేశారు.
ఈ నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ … మహా శివరాత్రి సందర్భంగా ఎక్కడా ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనరేట్ నందు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని స్నాన ఘాట్లలో ఎన్.డి.ఆర్.ఎఫ్./ఎస్.డి.ఆర్.ఎఫ్.సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కడా ఎటువంటి ప్రమాదాలు జరుగకుండా ఉండెందుకు సంబంధిత అన్ని శాఖల సమన్వయంతో బందోబస్త్ ఏర్పాట్లను చేయడం జరిగిందని, అందరూ ఆనందోత్సాహాల మధ్య మహా శివరాత్రి పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియచేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్, డి.సి.పి. లు అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., కె.శ్రీనివాసరావు ఐ.పి.ఎస్, శ్రీ ఏ.బి.టి.ఎస్. ఉదయరాణి ఐ.పి.ఎస్., కె.చక్రవర్తి, టి.హరికృష్ణ, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, ఇన్స్పెక్టర్లు, మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.