ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పై వెలిసిన కనక దుర్గమ్మను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి, ఐ.ఏ.ఎస్ దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు మరియు కార్యనిర్వహణాధికారి కె ఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి శ్రీ అమ్మవారి దర్శనం కల్పించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము వీరికి ఆలయ ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ చైర్మన్ గారు, కార్యనిర్వహణాధికారి వారు శ్రీ అమ్మవారి ప్రసాదము, శేషవస్త్రం, చిత్రపటం అందజేశారు.అనంతరం వీరు శ్రీ మల్లేశ్వర స్వామి వారి ఆలయమునకు విచ్చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఆర్ జిల్లా సంయుక్త కలెక్టర్ సంపత్ కుమార్, ఐఏఎస్ గారు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags indrakiladri
Check Also
హస్తకళాభిమానులను అలరించనున్న లేపాక్షీ గాంధీ శిల్ప్ బజార్
– ఈ నెల 22 నుంచి డిసెంబర్ 1 వరకు హస్తకళా ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాలు. – ప్రారంభోత్సవ కార్యక్రమానికి …