Breaking News

అభ్యర్థులు ఎన్నికల ఖర్చు విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలి .. జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తాము ఖర్చు చేయబోయే ఎన్నికల ఖర్చు విధి విధానాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్లోని తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలో 6,7,8 ఓటర్ల క్లెయిమ్ ఫారాలకు సంబంధించి 5,415 పెండింగ్లో ఉన్నాయని, వాటిని సత్వరమే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో తొలగింపులు సాధ్యపడవని, కేవలం చేర్పులకు మాత్రమే అవకాశం ఉంటుందని ఆ లోపుగా అలాంటి తొలగింపులు ఏవైనా ఉంటే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలతో పాటు కృష్ణా యూనివర్సిటీలోని స్ట్రాంగ్ రూమ్ లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఖరారు చేయబడ్డాయని, అందుకు సంబంధించిన వివరాలను పరిశీలించాలని రాజకీయ పార్టీలకు సూచించారు. తొలుత అభ్యర్థుల ఎన్నికల ఖర్చు, పత్రికలు, టెలివిజన్, సోషల్ మీడియా, ఫ్లెక్సీలు, హోర్డింగులు, కరపత్రాలు, సినిమా వంటి మాధ్యమాల ద్వారా చేసే రాజకీయ ప్రచార ప్రకటనలు, చెల్లింపు వార్తలపై ఈఈఎం నోడల్ అధికారి భాస్కరరావు, ఎంసిఎంసి నోడల్ అధికారి ఎం వెంకటేశ్వర ప్రసాద్ పార్టీ ప్రతినిధులకు వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు వారి అభ్యర్థులు వారి ప్రచారానికి సంబంధించిన సమావేశాలు, ర్యాలీలకు సంబంధించి ఖర్చు పెట్టే వస్తువులు, సామాగ్రి, పరికరాలపై ధరలు నిర్ణయిస్తూ అందుకు సంబంధించిన రేటు కార్డు ప్రతులను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు, వైసీపీ, బిజెపి, టిడిపి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, బీఎస్పీ ప్రతినిధులు సిలార్ దాదా, పి గజేంద్రరావు, బి దాసు, వంశీకృష్ణ, యశ్వంత్, బాషా, అబ్దుల్ మతీన్, కొడాలి శర్మ, ఎస్ బాలాజీ, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ దుర్గా కిషోర్ పాల్గొన్నారు.

Check Also

విఎంసి సిబ్బందికు సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణ కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *