-జిల్లాలో రూ.28.29 కోట్ల లబ్ధి పొందిన 18,861 మంది అగ్రవర్ణ పేద మహిళలు
-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అగ్రవర్ణ పేదలను సైతం ఆర్థికంగా బలోపేతం చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు ప్రతిరూపమే ఈబీసీ నేస్తం పథకమని జిల్లాలో 18,861 మంది అగ్రవర్ణ పేద మహిళలకు రూ.28.29 కోట్ల లబ్ధి చేకూరుస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం నంద్యాల జిల్లా బనగానపల్లె నుండి వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా మహిళలకు ఆర్ధిక సహాయాన్ని బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కలెక్టరేట్‌లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు ప్రత్యక్షంగా వీక్షించి అనంతరం ఆర్థిక సహాయపు చెక్‌ను లబ్దిదారులకు అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు మాట్లాడుతూ గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మాత్రమే ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం మంజూరు చేయడం జరిగేదన్నారు. నిరుపేదలు ఆర్థికంగా బలో పేతం అయితే సామాజం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బావించి అగ్రవర్ణాలలోని నిరుపేదలకు వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ క్షత్రియ, వెలమ వంటి ఓసి సామాజిక వర్గాలకు చెందిన నిరు పేదలకు ప్రతీ ఏడాది 15 వేల రూపాయలు చొప్పున మూడు సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు. మొదటి విడత 2021`22 ఆర్థిక సంవత్సరంలో 17,610 మంది లబ్దిదారులకు రూ.26.42 కోట్లు, రెండవ విడత 2022`23 ఆర్థిక సంవత్సరంలో 19.482 మంది లబ్దిదారులకు రూ. 29.22 కోట్లు, ధైవార్షిక మంజూరులో భాగంగా 580 మంది లబ్దిదారులకు 87 లక్షలు మొత్తంగా ఇప్పటికే 37,672 మంది లబ్దిదారులకు రూ. 56.51 కోట్ల లబ్ది చేకూర్చడం జరిగిందన్నారు. మూడో విడతలో నేడు జిల్లాలో 18,861 మంది మహిళలకు రూ. 28.29 కోట్ల రూపాయల లబ్దిని చేకూరుస్తున్నామన్నారు. ఈబీసీ నేస్తం ఆర్థిక సహాయం అందించడంలో పారదర్శకతను పాటించేందుకు ఆర్థిక సహాయాన్ని మహిళల ఖాతాలలో నేరుగా జమ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం అందించే సహాయాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని లబ్దిదారులకు సూచించారు. ఈబీసీ నేస్తం ద్వారా అందించే ఆర్థిక సహాయం మహిళల స్వయం ఉపాధికి ఎంతో దోహదపడతుందని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బట్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ కె. గీతాంజలి దేవి, గౌడ కార్పొరేషన్ చైర్మన్ యం.శివరామకృష్ణ, ఏపిఐడిసి చైర్మన్ బండి పుణ్యశీల, వక్ఫ్‌బోర్డ్ అధ్యక్షులు గౌస్ మొహిద్ధీన్ లబ్దిదారులు పాల్గొన్నారు.