Breaking News

ఈనెల 17న గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్ష

-24 పరీక్ష కేంద్రాల్లో హాజరుకానున్న 10,525 మంది అభ్యర్థులు..
-24 మంది లైజనింగ్ అధికారులు, 24 మంది ఛీఫ్ సువరిండెంటెంట్లు..
-హాల్ టిక్కెట్ తో పాటు ఫోటో తో ఉన్న ఏదైన ఓరిజనల్ ఆధార్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డు, ఓటర్ కార్డులను -తమతోపాటు తప్పనినరిగా తీసుకురావాలి..
-అభ్యర్థులు మొబైల్ ఫోన్స్, క్యాలిక్యూలెటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను వరీక్ష కేంద్రానికి తీసుకురావద్దు..
-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా ఈనెల 17వ తేదీ ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-1 స్క్రీనింగ్ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేసి కేంద్రాలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. డిల్లీరావు అధికారులను ఆదేశించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఏపిపిఎస్సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు చేపట్టవలసిన ఏర్పాట్లపై శుక్రవారం నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు లైజనింగ్ ఆఫీసర్లు, సూపర్ వైజర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ ఆదివారం నగరంలోని 24 కేంద్రాలలో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 12.00 గంటల వరకు తిరిగి మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 4.00 గంటల వరకు అబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ పరీక్షకు 10,525 మంది అభ్యర్థులు హాజరుకానున్నారన్నారు. పరీక్షల సక్రమ నిర్వహణకు ప్రతి కేంద్రానికి జిల్లా స్థాయి సీనియర్ అధికారులను 24 మంది లైజన్ అధికారులుగా నియమించామని వీరంతా ఆయా కేంద్రాలను తనిఖీ చేసి పరీక్ష నిర్వహణకు అవసరమయ్యే వసతులు, సౌకర్యాలను పరిశీలించాలన్నారు. పరిక్షలను సజావుగా నిర్వహించేందుకు 24 మంది ఛీఫ్ సుపరిండెంటెంట్లగా నియమించామన్నారు. పరీక్షల మెటీరియల్ను కేంద్రాలకు తరలించేందుకు వీలుగా లైజన్ అధికారులకు ఇద్దరు ఆర్మడ్ పోలీస్ పర్సన్స్ను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు హాల్ టిక్కెట్ తో పాటు పోటోతో ఉన్న ఏదైన ఒరిజనల్ ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డ్, పాస్ పోర్ట్, రేషన్ కార్డ్, ఐడి గుర్తింపు కార్డులను తప్పకుండా తమతో తీసుకురావాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని, ఉదయం 9.45 తరువాత, మధ్యాహ్నం పరీక్షకు 1.45 తరువాత అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించడం జరగదని కలెక్టర్ స్పష్టం చేశారు. అభ్యర్థులు మొబైల్ ఫోన్స్, క్యాలిక్యూలెటర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రానికి తీసుకురాకుండా ముందుగానే తెలపాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సంబంధిత తహాశీల్దార్లు 144 సెక్షన్ అమలు చేసే విధంగాను పరీక్ష కేంద్రాల పరిసరాలలో ఇంటర్నెట్, జిరాక్సు సెంటర్లు ముసివేసేలా ఆదేశించామన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పరీక్ష కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎపిసిపిడిసిఎల్ అధికారులను ఆదేశించామన్నారు. సీనియర్ ఏఎన్ఎంలతో కూడిన మెడికల్ సిబ్బంది, అత్యవసర మందులతో మెడికల్ కాంప్ను ఏర్పాటు చేయాలన్నారు. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా అందరి సమన్వయంతో ఈ పరీక్షలను విజయవంతం చేయాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను కోరారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్, ఆర్డీవో బీహెచ్. భవాని శంకర్ ఉన్నారు.

Check Also

ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు

-రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు -రూ.1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం -వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *