హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
ఇప్పటి వరకు తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళిసై ఇటీవల రాజీనామా చేశారు. ఆమె తమిళనాడు నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ నూతన గవర్నర్ ప్రమాణస్వీకారానికి మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఇదీ రాధాకృష్ణన్ నేపథ్యం..
రాధాకృష్ణన్ 1998, 1999లో రెండుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ నేపథ్యంలో పెరిగారు. మే 4, 1957లో జన్మించిన సీపీ రాధాకృష్ణన్ బీజేపీ సీనియర్ నేతగా ఎదిగారు. తమిళనాడులో బీజేపీ బలపడేందుకు ఎన్నో పోరాటాలు చేసింది. బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా, కేరళ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌గా పనిచేశారు. 2004 నుంచి 2007 వరకు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా, 2016 నుంచి 2019 వరకు కోయిర్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్నారు.
రాధాకృష్ణన్ ఫిబ్రవరి 2023 నుండి జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేశారు. ఇటీవల తమిళిసై రాజీనామా చేయడంతో, కేంద్రం ఆయనకు తెలంగాణ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను అప్పగించింది. అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గవర్నర్‌లుగా నియమితులైన నరసింహన్, తమిళిసై, రాధాకృష్ణన్‌లు తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారే.
Prajavartha Online Telugu News