విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. విధ్యాధరపురం, ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులో గల అగర్వాల్ కళ్యాణ మండపం నందు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో గురువారం బిజెపి కార్యకర్తల ఆత్మీయ సమావేశం జరిగినది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భారతీయజనతాపార్టీ రాష్ట్ర మైనార్టీ మోర్చ అధ్యక్షులు షేక్ బాజి మాట్లాడుతూ దేశం మొత్తంలో జరుగుతున్న అభివృద్ధిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా అభివృద్ధి చెయ్యాలనే తపనతో ప్రధాన మిత్రపక్షాలతో పొత్తు పెట్టుకొని వెలుతున్న సందర్భంలో ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రజలందరిని మేము అడగగలిగే అంశం ఎమిటంటే ఎవరైతే కరోనా సమయంలో ఉచిత వ్యాక్సిన్ ఇచ్చారో, ఎవరైతే గత 7 సంవత్సరాలుగా ఉచిత రేషన్ ఇస్తున్నారో, ఎవరైతే లక్షల ఇల్లు పేద ప్రజలకు ఇస్తున్నారో, ఎవరైతే జల్ జీవన్ మిషన్ ద్వారా మంచినీటి కొలాయిలు ఇస్తున్నారో, ఉజ్వల యోజన పథకం క్రింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నారో, ఎవరైతే స్వచ్ఛభారత్ క్రింద ఉచిత మరుగుదొడ్లు ఇస్తున్నారో, ఎవరైతే సాగరమాల, భారత్‌మాలలో దేశం మొత్తం నేషనల్ హైవేలు నిర్మిస్తున్న సందర్భంలో విజయవాడలోని బెంజి సర్కిల్ ఫ్లైఓవర్, కనకదుర్గ గుడి ఫ్లైఓవర్లు నిర్మించారో వారికే ఓట్లు వెయ్యాలని ఆయన అన్నారు. కులం, మతం, వర్గం, వర్ణం చూడకుండా నరేంద్ర మోది సబ్ కా సాత్ సబ్ కా వికాస్ పేరుతో ముందుకు వెళుతున్నారో అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన నాయకుల కూటమితో ముందుకు వెళతామని, ఈసారి విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో బిజెపి అభ్యర్దిని గెలిపించాలని ఆయన వివరించారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ సీటు పొత్తులో భాగంగా బిజెపిలో ఎవరికి ఇచ్చినా మద్దతిస్తామన్నారు. భారతీయ జనతాపార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీల పొత్తులో భాగంగా ఆంద్రప్రదేశ్ లో 6 పార్లమెంటు 10 అసెంబ్లీ నియోజక వర్గాలు బిజెపి కి కేటాయించిన నేపధ్యంలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడుకి, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కి కృతజతలు తెలియజేస్తూ, పొత్తులో భాగంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ సీటును బీజేపీకి కేటాయించినందుకు కూటమి సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో అవినీతి అరాచకంతో పాలన కొనసాగిస్తున్న వైసీపీ పాలన అంతమే లక్ష్యంగా బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి పనిచేస్తుందన్నారు. ఈసారి 30 వేల మెజారిటీతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గొలగాని రవికృష్ణ, ఉప్పలపాటి శ్రీనివాసరావు, మువ్వల సుబ్బయ్య, ఆర్ముగం, బబ్బూరి శ్రీరామ్, బొడ్డు నాగలక్ష్మీ, బుల్లబ్బాయి, బీజేపీ నియోజకవర్గ కన్వీనర్లు పోతంశెట్టి నాగేశ్వరరావు, నామిశెట్టి వెంకట్, పొటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …