విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, గవర్నరుపేట, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్లోని కాంగ్రెస్ ఆఫీసులో గురువారం ఎపిసిసి అధ్యక్షురాలు వై. యస్. షర్మిలని కలిసి, కాపు సమస్యలను వివరించి తమ మ్యానిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరచాలని కోరారు. దామాషా ప్రకారం కోస్తా జిల్లా, రాయలసీమ జిల్లా, ఉత్తరాంధ్రలో కాపు సామాజికవర్గానికి కాపు, తెలగ, బలిజ, ఒంటరిలకు తగినస్థానం కల్పించాలి. అదే విధంగా తమిళనాడు తరహాలో ఆంధ్రప్రదేశ్లో కాపుసామాజిక వర్గానికి చెందిన కాపు, తెలగ, బలిజ, ఒంటరిలకు రిజర్వేషన్ 5% నుండి 10% పెంచి రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము. అదే విధంగా ప్రతి జిల్లాలలోను కాపు భవనాలను నిర్మించాలి, ప్రత్యేక నిధులు కేటాయించాలి. అలాగే కులాల వారీగా కులగణన చేపట్టి రాష్ట్రంలో ఉన్న కాపు సామాజిక వర్గ వాస్తవ సంఖ్యను లెక్కించి దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయాలలో అవకాశాలు కల్పించాలని కోరారు. వినతి పత్రం అందించినవారిలో రాష్ట్ర ఐక్యకాపునాడు అధ్యక్షులు బేతు రామమోహనరావు, ముత్యాల రమేష్, వన్నెంరెడ్డి రాధాకృష్ణ, వెలుగంటి లక్ష్మణరావు, భూపతి మహేష్, కల్లి పరమ శివ, ఉమ్మడిశెట్టి కృష్ణమూర్తి, దీపిక గునుకుల తదితరులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …