విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యాయని, సోమవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకన కార్యక్రమం (స్పాట్ వాల్యూయేషన్) ప్రారంభమైందని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా తొలి రోజు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ విజయవాడలోని బిషప్ హజరయ్య స్కూల్లోని మూల్యాంకన కేంద్రాన్ని సోమవారం ఉదయం సందర్శించారు. కమీషనర్ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తో పాటు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానంద్ రెడ్డి, పరిశీలకులు (అబ్జర్వర్) డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి యు.వి. సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మూల్యాంకన కార్యక్రమం ఈ నెల 8వ తేది వరకు కొనసాగుతుంది.
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …