-త్వరగా స్పందించండి.. ఓటరుగా నమోదు చేయండి
విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పుడు దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందిన వారు కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేయవచ్చు. అయితే.. కొత్తగా ఓటు హక్కుకు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 15తో ముగియనుంది. 2006 మార్చి 31లోపు పుట్టిన వారు ఓటు హక్కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఇప్పటికే 18ఏళ్లు నిండినా ఓటు హక్కు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
మీ ఫోన్లోనూ కూడా voters.eci.gov.in సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ప్రజాస్వామ్యం రక్షణ, అవినీతి వ్యతిరేక ప్రభుత్వాల కోసం యువతరం కదిలి తక్షణమే ఓటు నమోదు చేసుకోండి.