Breaking News

తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు ప్రక్రియ పర్యవేక్షన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెండవ రోజు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్ , వివి ప్యాట్ స్కానింగ్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత తెలియ చేశారు. శనివారం స్థానిక ఎఫ్ సి ఐ గోడౌన్ లో జిల్లా సెంట్రలైజ్డ్ ఈ వి ఎమ్ గోడౌన్ లో భద్రపరిచిన ఏడు నియోజక వర్గాల కు చెందిన ఈవిఎమ్, అనుబంధ యూనిట్స్ ఆయా నియోజక వర్గాల తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు తరలింపు ప్రక్రియని వ్యక్తిగతంగా మాధవీలత పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత వివరాలు తెలియచేస్తూ, తొలిరోజు పార్లమెంటు నియోజక వర్గాల కోసం కేటాయించిన బ్యాలెట్ యూనిట్స్ కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్ యూనిట్స్ ఆయా నియోజక వర్గాల స్ట్రాంగ్ రూమ్ లలో భద్రపరచి సీల్ వెయ్యడం జరిగిందన్నారు. రెండవ రోజు అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ లని పంపడం జరిగిందన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ పర్యవేక్షణలో, ఈ వి ఎమ్ జిల్లా నోడల్ అధికారి ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి ఆధ్వర్యంలో నియోజక వర్గాల వారీగా ఈ వీ ఎమ్ యూనిట్స్ పంపడం జరిగిందన్నారు. ఈ వి ఎమ్ లు, ఇతర అనుబంధ బ్యాలెట్ యూనిట్స్ భద్ర పరుచుటకు సిద్దం చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లకు జిల్లా స్ట్రాంగ్ రూమ్ గోడౌన్ నుంచి తరలించిన యూనిట్స్ రాజకీయ పార్టీల ప్రతినిధులు సమక్షంలో నిర్వహించినట్లు తెలియ చేశారు.

నియోజక వర్గాలు వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల వివరాలు
1) 040 – అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం – శ్రీ రామారెడ్డి జెడ్.పి.పి. బాయ్స్ హై స్కూల్, అనపర్తి నకు 228 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన రిజర్వ్ యూనిట్స్ తో కలిపి 273 బ్యాలెట్ యూనిట్స్, 273 కంట్రోల్ యూనిట్స్,  296 వివి ప్యాట్స్ పంపడం జరిగింది.

2) 049 – రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గం
ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, వెలుగుబంద నకు 216 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన రిజర్వ్ యూనిట్స్ తో కలిపి 259 బ్యాలెట్ యూనిట్స్, 259 కంట్రోల్ యూనిట్స్,  280 వివి ప్యాట్స్ పంపడం జరిగింది.

3) 050 – రాజమండ్రీ అర్బన్ నియోజకవర్గం, ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల,  రాజమహేంద్రవరం నకు  232 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన రిజర్వ్ యూనిట్స్ తో కలిపి  285 బ్యాలెట్ యూనిట్స్, 285 కంట్రోల్ యూనిట్స్,  310 వివి ప్యాట్స్ పంపడం జరిగింది

4) 051 – రాజమండ్రీ రూరల్ నియోజక వర్గం నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్  (NAC) హాస్టల్ భవనం, కలెక్టరేట్‌, ధవళేశ్వరం నకు  264 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన రిజర్వ్ యూనిట్స్ తో కలిపి  324 బ్యాలెట్ యూనిట్స్,  324 కంట్రోల్ యూనిట్స్, 348 వివి ప్యాట్స్ పంపడం జరిగింది

5) 054 – కొవ్వూరు (SC) అసెంబ్లీ నియోజకవర్గం శ్రీ మావులేటి సోమరాజు సంస్కృత ఉన్నత పాఠశాల, కొవ్వూరు నకు  176 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన రిజర్వ్ యూనిట్స్ తో కలిపి  211 బ్యాలెట్ యూనిట్స్,  211 కంట్రోల్ యూనిట్స్, 228 వివి ప్యాట్స్ పంపడం జరిగింది.

6) 055 – నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం జూనియర్ కళాశాల (బాలికలు), నిడదవోలు నకు  205 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన రిజర్వ్ యూనిట్స్ తో కలిపి  246 బ్యాలెట్ యూనిట్స్,  246 కంట్రోల్ యూనిట్స్,  266 వివి ప్యాట్స్ పంపడం జరిగింది

7) 066 –  గోపాలపురం (SC) అసెంబ్లీ నియోజకవర్గం డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులం (బాలికల) రెసిడెన్షియల్ పాఠశాల,  గోపాలపురం నకు  248 పొలింగ్ కేంద్రాల కు సంబంధించిన రిజర్వ్ యూనిట్స్ తో కలిపి  297 బ్యాలెట్ యూనిట్స్, 297 కంట్రోల్ యూనిట్స్, 322 వివి ప్యాట్స్ పంపడం జరిగింది

ఈ రాండమనైజేషన్ , అనంతరం వాహనాల తరలింపు కార్యక్రమంలో   రాజమండ్రీ రూరల్ ఆర్వో జె సి – ఎన్. తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో, మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, కొవ్వూరు  ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , డి ఆర్వో జీ. నరసింహులు, రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి,  గోపాలపురం ఆర్వో – కె ఎల్ శివజ్యోతి,  అనపర్తి ఆర్వో ఎమ్. మాధురీ, నిడదవోలు ఆర్వో ఆర్.వి.రమణా నాయక్ , రాజమండ్రీ పార్లమెంటు సహయ రిటర్నింగ్ అధికారి – ఎస్.డి.సి. ఆర్.కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్, పి. సువర్ణ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *