గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ విధులు కేటాయించబడిన పశ్చిమ నియోజకవర్గ ఉద్యోగులు ఈ నెల 22 వ తారీఖు లోపు నగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ లో ఫారం-12లను అందించాలని, పోస్టల్ బ్యాలెట్ ఫారాల స్వీకరణకు ప్రతేక సిబ్బందిని కేటాయించామని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ(94) రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్.ఓ) కె. రాజ్యలక్ష్మి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ, గుంటూరు పచ్చిమ నియోజకవర్గంలో ఓటు కల్గి ఉండి 2024 సాదారణ ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల విధులు కేటాయించబడిన ఉద్యోగులకు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని ఎలక్షన్ సెల్ నందు ఫారం-12(2 కాపీలు) అందించాలని తెలిపారు. ఫారం-12తో పాటుగా ఓటర్ ఎపిక్ కార్డ్, డ్యూటీ ఆర్డర్ కాపి, 2 పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవ్వాలన్నారు. ఉద్యోగుల నుండి అందే ఫారం-12 వివరాలను ప్రత్యేక రిజిస్టర్ లో ఏరోజుకు ఆరోజే నమోదు చేయాలని ఎలక్షన్ సెల్ సిబ్బందిని ఆదేశించారు.
Tags guntur
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …