మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
సాధారణ ఎన్నికలు 2024 సందర్భంగా ఎన్నికల పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలు మీడియా కవరేజ్ నిమిత్తం రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా ప్రతినిధులకు అథారిటీ లెటర్స్ జారీ చేసింది. వీటిని పోలింగ్ కౌంటింగ్ తేదీలకు ముందుగా ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందజేయడం జరుగుతుంది. పోలింగ్ విధుల్లో ఉన్న పాత్రికేయులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకొనదలచిన వారు 12D ఫారాలు కలెక్టరేట్లో లోని మీడియా సెంటర్ నందు ఈరోజు(18.4.2024) నుండి జారీ చేయడం జరుగుతుంది. భర్తీ చేసిన 12D ఫారం ఈ నెల 22వ తేదీలోగా మీడియా కేంద్రంలోనే సమాచార శాఖ సిబ్బందికి అందజేయవలసిందిగా కోరడమైనది. ఫోటో ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు నకళ్ళు జత చేయవలసిందిగా కోరడమైనది. కావున పాత్రికేయులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోనవల్సిందిగా కోరడమైనది.
Tags machilipatna
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …