-విద్యార్థులకు ఇంటెన్షిప్ సర్టిఫికెట్స్ అందజేత
-దేశ గౌరవాన్ని పెంచే విధంగా విద్యార్థులు ఉండాలి మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం మహిళా కమిషన్ కార్యాలయంలో ‘మార్పు’ (మనోరమ అర్జునరావు పబ్లిక్ యుటిలిటీ ట్రస్ట్) స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మారిస్టెల్లా కాలేజ్ విద్యార్థులు మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల లక్ష్మిని కలిశారు. ఈ సందర్భంగా 25 మంది విద్యార్థులకు ఇంటెన్షిప్ ప్రాజెక్ట్ కింద సర్టిఫికెట్స్ ను చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అందజేయడం జరిగింది. 25 మంది విద్యార్థులు వివిధ అంశముల మీద ఆహారము, పోషణ, cyber సెక్యూరిటీ, యుక్త వయసులో వచ్చే మార్పులు, వ్యక్తిగత ప్రేరణ ఆత్మహత్యను ముందుగా నివారించడం వంటి సమస్యలపై ఆరు నెలలగా మార్ఫు సంస్థ ద్వారా శిక్షణ పొందడం జరిగిందన్నారు. వీరిలో కొంతమంది విద్యార్థులు ఇతర దేశములకు కూడా వెళ్లారని, మరి కొంతమంది దేశ రాజధాని ఢిల్లీలో సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్నారు. దేశ అభివృద్ధిని పెంచే విధంగా విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ విధమైన సేవలందించే స్వచ్ఛంద సంస్థలకు మహిళా కమిషన్ అండగా ఉంటుందన్నారు.
అనంతరం మార్పు సంస్థ వ్యవస్థాపకులు రావూరి సూయాజ్ ని చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి అభినందించారు. ఈ సందర్భంగా సూయజ్ మాట్లాడుతూ విద్యార్థులకు నిస్వార్థ సేవతో మార్పు సంస్థ ద్వారా ఇంటెన్షిప్ ప్రాజెక్టులను అందజేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సెక్రటరీ వసంత బాల, మహిళ కమిషన్ కార్యాలయం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.