Breaking News

పుచ్చగడ్డలో హోమ్ ఓటింగ్ పరిశీలించిన జిల్లా కలెక్టర్

అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం అవనిగడ్డ నియోజకవర్గంలో హోం ఓటింగ్ నిర్వహణ తీరు పరిశీలించారు. తొలుత కలెక్టర్ చల్లపల్లి మండలం పుచ్చగడ్డలో పిడబ్ల్యుడి ఓటర్ గొరిపర్తి బుజ్జి ఇంటి వద్ద హోమ్ ఓటింగ్ బృందం నిర్వహిస్తున్న హోం ఓటింగ్ పరిశీలించారు. ఎన్నికల నిబంధనల మేరకు ఓటరు డిక్లరేషన్ తీసుకోవాలని, బ్యాలెట్ నెంబర్, వోటర్ సీరియల్ కరెక్ట్ గా వేయాలని, సీక్రసీ ఆఫ్ ఓటింగ్ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం 85 ప్లస్ వయస్సు గలవారు దివ్యాంగులు, పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయలేని స్థితిలో ఉన్నవారికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని, ఈ సౌకర్యాన్ని వారు సక్రమంగా వినియోగించుకునేలా హోం ఓటింగ్ బృందాలు కృషి చేయాలన్నారు.

అనంతరం అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఎన్నికల స్ట్రాంగ్ రూమ్ కలెక్టర్ పరిశీలించి ఈవీఎం కమిషనింగ్ అంటే బ్యాలెట్ యూనిట్ లో బందరు పార్లమెంట్ బ్యాలెట్ పేపర్ సెట్ చేయడం, కంట్రోల్ యూనిట్ వీవి ప్యట్ లో అభ్యర్థులు వారి గుర్తులు లోడ్ చేయడం వాటికి సీల్ వేయడం వంటి కార్యక్రమాన్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారి బాలసుబ్రమణ్యం అవనిగడ్డ నియోజకవర్గంలో ఈవీఎం కమిషనింగ్ వివరాలు కలెక్టర్ కు తెలియజేశారు.

అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో హోం ఓటింగ్కు అర్హత గల 407 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా వారి ఇంటి వద్దనే హోం ఓటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

పోస్టల్ బ్యాలెట్ ఏ ఆర్ ఓ, తాసిల్దారు సుమతి, హోమ్ ఓటింగ్ బృందంలో పివో లు జయంతి, వై శ్రీనివాస్, మైక్రో అబ్జర్వర్ కె సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *