Breaking News

తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి…

-కిర్గిజ్ స్తాన్ (బిష్కెక్)లో ఉంటున్న భారతీయ పౌరులకు భారత విదేశాంగ శాఖ ముఖ్య గమనిక

తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కిర్గిజ్ స్తాన్ దేశంలో, ఒక ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు,విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే కిర్గిజ్ స్తాన్ లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్ 0555710041 ను సంప్రదించాలని సూచిస్తూ భారత విదేశాంగ శాఖ 18.05.24 తేదీన మార్గదర్శకాలు జారీ చేసింది. భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తోంది అని తెలిపింది. విద్యార్థులు వసతి గృహాల్లోనే ఉండాలని, భారత రాయబార కార్యాలయంతో నిత్యం అందుబాటులో ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ ఈ విషయాన్ని నిన్ననే అధికారిక వెబ్ సైట్, సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

విదేశీ యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం ఏపీఎన్ఆర్టీఎస్ ఎప్పటికప్పుడు కేంద్రప్రభుత్వమ్ గైడ్లైన్స్ అనుసరిస్తూ, పరిస్థితిని తెలుసుకుంటోంది. నిన్న (18.05.24) నలుగురు (04) తెలుగు విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ హెల్ప్ లైన్ ను సంప్రదించారు. అల్లర్లు జరుగుతున్న ప్రదేశాల నుండి భారతీయ/తెలుగు విద్యార్థులందరూ సురక్షిత ప్రదేశాలలో ఉన్నారని తెలిపారు. భారతీయ విద్యార్థులు మెడిసిన్ చదవడానికి ఎక్కువ సంఖ్యలో కిర్గిజ్ స్తాన్ వెళ్తారు. అందులో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు భారతీయ విద్యార్థులపై ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినట్టు నివేదిక లేదు.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రజలు, విద్యార్థులు ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్ లైన్ నంబర్లు
+91 863 2340678, +91 8500027678 (W) మరియు కిర్గిజ్ స్తాన్ లోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్ 0555710041 ను సంప్రదించగలరు. ఏపీఎన్ఆర్టీఎస్ ఇమెయిల్స్: info@apnrts.com; helpline@apnrts.com; ద్వారా కూడా సంప్రదించగలరు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *