Breaking News

కిర్గిజ్‌స్థాన్‌లో పరిస్థితి ప్రస్తుతం సాధారణంగానే ఉంది…

-మే 23 నుండి ప్రతిరోజూ బిష్కెక్ నుండి న్యూఢిల్లీకి నేరుగా 02 విమానాలు
-APNRTS కు తెలిపిన చరణ్‌జీత్ సింగ్, అదనపు కార్యదర్శి, యురేషియా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం

తాడేపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కిర్గిజ్‌స్థాన్‌లో పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ ఏపీఎన్ఆర్టీ సొసైటీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. మన తెలుగు విద్యార్థులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, వారికి కౌన్సెలింగ్ ఇస్తోంది. ఏపీఎన్ఆర్టీఎస్, అందుబాటులో ఉన్న సమాచారాన్ని మరియు విదేశాంగ శాఖ (MEA) ఇస్తున్న సలహాలను, సకాలంలో విద్యార్థులకు తెలుపుతోంది. తమ ప్రయత్నాలకు కొనసాగింపుగా… కిర్గిజ్‌స్థాన్‌లో ఏపీ విద్యార్థుల భద్రత మరియు శ్రేయస్సును గురించి, అలాగే ప్రస్తుత పరిస్థితి మరియు విద్యార్థుల సమస్యల గురించి వివరిస్తూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యురేషియా అదనపు కార్యదర్శి చరణ్‌జీత్ సింగ్ కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతోంది. కిర్గిజ్‌స్థాన్‌లోని ఏపీ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రుల నుండి వచ్చిన/వస్తున్న అభ్యర్థనలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు వివరిస్తూ త్వరితగతిన విద్యార్థులను స్వదేశానికి రప్పించే అవకాశాల గురించి ఏపీఎన్ఆర్టీఎస్ ఆరా తీసింది.

అదనపు కార్యదర్శి కార్యాలయం-యురేషియా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, దీనిపై స్పందించి కిర్గిజ్‌స్థాన్‌లోని బిష్కెక్ లో ప్రస్తుత పరిస్థితి సాధారణంగానే ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఎన్ఆర్టీఎస్ కు తెలియజేసింది. మన దేశ వైద్య విద్యార్థులు భారతదేశానికి తిరిగి రావడానికి ముందు, నేషనల్ మెడికల్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మార్గదర్శకాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. మరియు విద్యార్థులు భారతదేశానికి తిరిగి రావాలనుకుంటే, మే 23 నుండి బిష్కెక్ నుండి న్యూఢిల్లీకి నేరుగా ప్రతిరోజూ రెండు (02) విమానాలు నడుస్తాయని కూడా విదేశాంగ శాఖ తెలిపింది. ఏదైనా అత్యవసర సహాయం కోసం, భారతీయ/తెలుగు విద్యార్థులు బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయం వారి హెల్ప్‌లైన్ నంబర్ 0555710041 ను సంప్రదించవచ్చు.

పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని… విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భయపడవద్దని, మరియు అప్రమత్తంగా ఉండాలని, అలాగే ఎంబసీ సూచించినట్టు సురక్షిత ప్రదేశాల్లోనే ఉండాలని ఏపీఎన్ఆర్టిఎస్ మరోసారి విజ్ఞప్తి చేసింది. కిర్గిజ్‌స్థాన్‌లోని ఏపీ విద్యార్థులు సహాయం కోసం ఏపీఎన్ఆర్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ నంబర్లు +91 863 2340678; +91 85000 27678(వాట్సాప్) లేదా ఇమెయిల్ info@apnrts.com; helpline@apnrts.com ను సంప్రదించగలరు.

Check Also

సేవా సంస్థలు ఐక్యంగా కృషి చేయాలి

-వల్లంరెడ్డి లక్ష్మణ రెడ్డి, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలోని సేవా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *