-ప్రజల సమస్యలను పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టం) ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో
-ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నగర ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ విన్నపం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ( పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్డ్రసల్ సిస్టం ) ప్రతి సోమవారం ఉదయం 10 గంటల కు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నందున ప్రజలందరూ తమ తమ ఫిర్యాదులను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన మరియు జోనల్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో విన్నవించుకోవాల్సిందిగా విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.