-హుటా హుటిన అధికారులతో కలిసి ఘటన ప్రాంతానికి చేరుకున్న ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
-సాధారణ ట్రాఫిక్ కు అందుబాటులోకి తీసుకొని వొస్తాము.
-కల్వర్టు నిర్మాణం సాధ్యమైనంత తొందరలోనే పూర్తి చేసే దిశగా చర్యలు
-ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
కోరుకొండ, నేటి పత్రిక ప్రజావార్త :
కోరుకొండ నుండి ముగ్గళ్ల వెళ్ళు రహదారి లో కి. మీ 3/4 లో తోట కాలువ వద్ద మైనర్ వంతెన (కల్వర్టు) నిర్మాణములో వున్న దృష్ట్యా గతంలో తాత్కాలిక రహదారి మార్గం ఏర్పాటు చేసి, అక్కడ పైపులు ఏర్పాటు చెయ్యనందున పై నుంచి వరద నీటి వల్ల గండి పండిందని, అందువల్ల తక్షణ పనులు చేపట్టే దిశలో క్షేత్ర స్థాయి లో అధికారులతో కలిసి పర్యటించినట్లు రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ తెలియజేశారు.
ఆదివారం మధ్యాహ్నం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ స్ధానిక తోట కాలవ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణ మాట్లాడుతూ, కోరుకొండ నుంచి కాపవరం మీదుగా మునగాల, కాపవరం గ్రామానికి వెళ్లే రహదారి మార్గంలో కల్వర్టు నిర్మాణం గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించి సకాలంలో పూర్తి చేయకపోవడం జరిగిందన్నారు. కల్వర్టు నిర్మాణం భాగంగా డైవర్షన్ మార్గాన్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసి తగిన దక్షిణ చర్యలు రక్షణ చర్యలు తీసుకోకపోవడం జరిగిందన్నారు. తాత్కాలికముగా ఏర్పాటు చేసిన డైవర్షన్ రోడ్డు పై నుంచి వొచ్చిన ప్రవాహంలో రహదారి మార్గం కొట్టుకుని పోవడం జరిగిందన్నారు. ప్రజల తక్షణ రక్షణ చర్యల్లో భాగంగా కాపవరం మునగాల మధ్య రహదారి మూసివేసి, అధికారులు ట్రాఫిక్ ను మళ్లింపు చేసినట్లు తెలిపారు. నీటి ప్రవాహం తగ్గిన వెంటనే డైవర్షన్ రోడ్డు ను నిర్మించి ట్రాఫిక్ ను యధావిధిగా పునరుద్ధిస్తామని అధికారులు తెలియ చెయ్యడం జరిగిందన్నారు. గత పాలకులు, కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణం అని ఎమ్మెల్యే బలరామ కృష్ణ పేర్కొన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత త్వరలో పనులను చేపట్టి పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలియజేశారు. ఆదిశలో ఆర్ అండ్ బి అధికారులు పూర్తి స్థాయిలో కాలువలో నీటి ప్రవాహం తగ్గిన వెంటనే పైపులు వేసి ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఆమేరకు తక్షణ మరమ్మతుల కోసం చర్యల తీసుకుంటా మన్నారు.
శాసన సభ్యులు వెంట ఆర్ అండ్ బి అధికారులు ఎస్బీవీ రెడ్డి, బీవీవి మధుసూదన్, స్ధానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు ఉన్నారు.