Breaking News

మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలతో పిడుగురాళ్ల లో శరవేగంగా జరుగుతున్న పారిశుధ్య పనులు

-డ్రైన్ ల పూడిక తీత తో పాటు ఇళ్ల మధ్యలో ఉన్న ముళ్ళ కంపలు,చెత్తని తొలగిస్తున్న సిబ్బంది
-డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో రెండుసార్లు పర్యటించిన పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ
-మూడు రోజుల్లోగా మొత్తం పారిశుధ్యం మెరుగుపరచాలని ఆదేశాలు
-మంత్రి ఆదేశాలతో పిడుగురాళ్ల తో పాటు సత్తెనపల్లి,నరసరావుపేట,మాచర్ల, వినుకొండ మున్సిపాలిటీ సిబ్బంది తో పనులు చేయిస్తున్న అధికారులు
-పారిశుధ్య పనుల్లో పాల్గొన్న 300 మందికి పైగా కార్మికులు, సిబ్బంది

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలతో పిడుగురాళ్లలో పారిశుద్ధ్య పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి…చుట్టుపక్కల మున్సిపాలిటీల నుంచి సైతం కార్మికులను తీసుకొచ్చి డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు అధికారులు.. వీలైనంత త్వరగా డయేరియా ను కట్టడి చేసేలా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది..
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో డయేరియా నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది ప్రభుత్వం.. పిడుగురాళ్లలోని లెనిన్ నగర్, మారుతి నగర్ లో డయేరియా కేసులు నమోదవుతున్నాయి.. దీంతో స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ డయేరియా ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు మంత్రి.. ఇప్పటికే రెండుసార్లు ఆయా ప్రాంతాల్లో స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. తాగునీరు ఎక్కడ కలుషితమైందనే దానిపై దృష్టి సారించారు.. స్థానికంగా ఉన్న 10 బోర్లలో నీటిని పరీక్షలు చేయించారు. వీటిలో ఎనిమిది బోర్లలో నీటిలో నైట్రేట్ ఉన్నట్లు గుర్తించారు…. అయితే ఆయా బోర్లను గతంలోనే మూసివేశారు… అయినప్పటికీ కేసులు నమోదు కావడానికి గల కారణాలపై ఫోకస్ పెట్టారు.. క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా లేనిన్ నగర్,, మారుతి నగర్ లో పారిశుధ్య లోపం ఉన్నట్లు మంత్రి గుర్తించారు. దీంతో రెండు రోజుల్లోగా ట్రైన్లలో పూడిక తీత, మల్ల కంపలు పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నారాయణ.మంత్రి ఆదేశాలతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు మొదలుపెట్టారు. పిడుగురాళ్ల మున్సిపాలిటీ సిబ్బందితో పాటు సత్తెనపల్లి, మాచర్ల, నరసరావు పేట, వినుకొండ మున్సిపాలిటీల నుంచి పారిశుద్ధ్య కార్మికులను రంగంలోకి దించారు. సుమారు 300 పైగా పారిశుధ్య కార్మికులు డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో శరవేగంగా పనులు చేస్తున్నారు. సోమవారం సాయంత్రానికల్లా పూర్తిస్థాయిలో పారిశుధ్యం మెరుగుపరిచేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. పిడుగురాళ్లలో డయేరియాను వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకొచ్చాలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ వర్షాకాలం కావడంతో ప్రజలంతా కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రభుత్వం సూచిస్తుంది.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *