Breaking News

నగరంలో “ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో ఉన్న ప్రసిద్ధి చెందిన క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యులు వారి ప్రాక్టీసు లోని అనుభవ ఆయుర్వేద చికిత్సల విశేషాలు ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు కి తెలుపుట ద్వారా విజ్ఞాన సముపార్జన, అభివృద్ధి కి దోహదపడుతుందన్న ఉద్దేశ్యం తో “ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషర్స్ కో-ఆపరేటివ్ ఫార్మసీ అండ్ స్టోర్స్” (ఇంపికాప్స్) ఆధ్వర్యంలో విజయవాడ, బీసెంట్ రోడ్ లో ఉన్న ఇంపీకప్స్ పంచకర్మ హాస్పిటల్ లో ప్రతి నెల జరుగుతున్న”ఆయుర్వేద సద్వైద్య సంభాష పరిషద్” కార్యక్రమంలో పాల్గొన్న సంస్ధ డైరెక్టర్ డా. వేముల భాను ప్రకాష్   మాట్లాడుతూ ఆయుర్వేద వైద్య పరిజ్ఞానాన్ని నవీకరించడం, అధునాతన జ్ఞానం, నైపుణ్యం పొందడం ,చికిత్స లో కలిగే సందేహాలు నివృత్తి ముఖ్య ఉద్దేశ్యం తో ఈ కార్యక్రమం ప్రతినెలా జరుపుతున్నామని తెలిపారు.గ్రంథస్థం గా ఉన్న విజ్ఞానం తో ప్రాక్టీసు చేస్తున్న వైద్యులు వారి ప్రాక్టీసు లో గుర్తించిన కొత్త విషయాలు ఇటువంటి కార్యక్రమంలో తోటి వైద్యులతో చర్చ జరిగినపుడు అది ప్రామాణికమై ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. ఆయుర్వేదo పై అవగాహన, ప్రచారం కోసం పాఠశాల స్థాయి నుండి సిలబస్ లో ఆయుర్వేద పాఠ్యoశాలు ప్రవేశపెట్టాలి. ఔషధ మొక్కల వినియోగం మరియు సాగు యొక్క ప్రాధాన్యత అందరికి తెలియాలి. ఆయుర్వేదం అనేది కేవలం ఆయుర్వేద వ్యక్తుల ద్వారానే కాకుండా, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, మేధావులు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే విధంగా అందరూ కలసి పనిచేయాలి. అనుభవ వైద్యాలను గ్రంథస్థం చేస్తే భావితరపు ఆయుర్వేద వైద్యులకు ఎంతో ఉపయోగపడుతుంది అన్నారు.ఇటీవల కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్   (సి.సి.ఆర్. ఏ. ఎస్)”ప్రగతి-2024(ఫార్మా రీసెర్చ్ ఇన్ ఆయుర్జ్ఞాన్ అండ్ టెక్నో ఇన్నోవేషన్) ప్రారంభిoచడo ద్వారా ఆయుర్వేదంలో పరిశోధన మరియు పరిశ్రమలు తమ ఉమ్మడి ప్రయత్నాలును అంతిమంగా సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా చేయడం కోసం కలిసి పనిచేయాలి అన్నారు.
ఉత్తమ వైద్య శ్రీ పమ్మి సత్యనారాయణ శాస్త్రి ఆయుర్వేద శాస్త్రం లో తన  అనుభవాలను మరియు సంకలనాలను  సభలో  పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ఆయుర్వేద వైద్యులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంకి సమన్వయ కర్తగా డా. పమ్మి సూర్యకుమార్ వ్యవహరించారు.డా.ప్రియాంక,డా. జాబిల్లి సహకారాన్ని అందించారు. ఈ సందర్భంగా ఉత్తమ వైద్య శ్రీ పమ్మి సత్యనారాయణ శాస్త్రి ని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ బొటనిస్ట్ వేణుగోపాల్, స్నిగ్ద ఆయుర్వేద హాస్పిటల్, గుంటూరు నిర్వాహకులు డా. కె. ఎస్. ఆర్ గోపాలన్, డా. చైత్యన్య  పాల్గొన్నారు.

Check Also

ఏపీఐఐసీ కొరకు సత్యవేడు మండలం రైతులతో భూసేకరణ పై ముఖాముఖి చర్చించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి,  నేటి పత్రిక ప్రజావార్త : మన రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలను పెట్టుబడులను పెట్టడానికి ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *