గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యుద్దప్రాతిపదికన చేపట్టాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ కాంట్రాక్టర్, ఇంజినీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం కమిషనర్ గోరంట్ల కొండమీద నిర్మాణపనులు నిలిచిన రిజర్వాయర్ ని పరిశీలించి సంబందిత అధికారులకు, కాంట్రాక్టర్ కు పనుల పురోగతిపై తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ప్రాజెక్ట్ వలన ఏ ప్రాంతాలకు, ఎంత మంది జనాభాకు త్రాగునీటి సమస్య తీరుతుంది, అంచనాలు, ప్రస్తుతం జరిగిన పనులు, ఇచ్చిన బిల్లులు, జరగాల్సిన పనులు, ఇతర అంశాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని, మాట్లాడుతూ గుంటూరు నగరంలో అనేక ఏళ్ల క్రితం విలీనమైన గ్రామాలకు అత్యంత ఆవశ్యకమైన గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు తక్షణమే ప్రారంభించాలని కాంట్రాక్టర్ ని ఆదేశించారు. పనులు ప్రారంభించిన తర్వాత బిల్లులు బకాయిల చెల్లింపుకు వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం జరిగిన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో కూడా ప్రజా ప్రతినిధులు సదరు ప్రాజెక్ట్ ప్రాధాన్యత, జాప్యంపై కౌన్సిల్ దృష్టికి తెచ్చారన్నారు. ఇంజినీరింగ్ అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు.
అనంతరం కొండ పక్కన ఉన్న కొండ బజార్ లో ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకురాగా స్పందించిన కమిషనర్ ప్రజలు వివరించిన సమస్యల్లో త్రాగునీటి సమస్యను తక్షణం పరిష్కారం చేయాలని ఏఈని ఆదేశించారు. వీధి దీపాల మరమత్తులు, పైప్ లైన్ లీకులు కూడా రెండు రోజుల్లో చేపట్టాలన్నారు. డ్రైన్ ల నిర్మాణం టెండర్ దశలో ఉన్నందున పనులు త్వరలో ప్రారంభం చేస్తామని ప్రజలకు తెలిపారు. అలాగే కొండ దగ్గరలోని క్రిస్టియన్ శ్మశాన వాటిక లో లెవల్ లో ఉందని ప్రజలు తెలియచేయగా నగరంలో రోడ్ల విస్తరణ సమయంలో వచ్చే మెటీరియల్, భవన నిర్మాణ మెటీరియల్ ను శ్మశానంలో లెవల్ చేయాలన్నారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగి విష పురుగులు వస్తున్నాయని, సదరు యజమానులకు వెంటనే స్థలాలను శుభ్రం చేసుకోవాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇవ్వాలని శానిటరీ ఇన్స్పెక్టర్ ని ఆదేశించారు.
పర్యటనలో ఎస్ఈ శ్యాం సుందర్, డిఈఈ హనీఫ్, సతీష్, ఏఈ అనూష, శానిటరీ ఇన్స్పెక్టర్ ప్రసాద్, కార్పొరేటర్ బాలాజీ, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
డిసెంబర్ 30 వ తేదీ సోమవారం యధాతధంగా కలెక్టరేట్ లో పి జి ఆర్ ఎస్ కలెక్టర్ పి ప్రశాంతి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే జిల్లా, డివిజన్, మండల స్థాయి పి జి …