అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అన్న క్యాంటీన్ల నిర్వహణ కోసం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు రూ.కోటి విరాళం ఇచ్చారు. ఈ చెక్‌ను ఆదివారం మంత్రి నారా లోకేశ్‌కు అందజేశారు. గంగరాజు చేయూతకు, ఉదార సహకారానికి మంత్రి లోకేశ్ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మెరుగైన ఆంధ్రప్రదేశ్‌కు బాటలు వేసేందుకు వివిధ భాగస్వాములు కలిసి వస్తున్నందుకు సంతోషిస్తున్నానంటూ, గంగరాజు విరాళమిచ్చిన ఫొటోను ‘ఎక్స్’లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.
Tags AMARAVARTHI
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …