-నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకొని విజయవాడ నగరంలో ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా భక్తులు అందరూ ఆనందోత్సవాలతో శాంతి భద్రతల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయు భద్రతా ఏర్పాట్లను సోమవారం ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. ఇతర అధికారులతో కలిసి వినాయకుడి గుడి, అమ్మవారి టెంపుల్, ఘాట్ లను, క్యూ లైన్ల ఏర్పాట్లను, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు సలహాలు అందించడం జరిగింది.
ఈ నేపధ్యంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. మాట్లాడుతూ నగరంలో శ్రీ దుర్గామళ్లేశ్వర స్వామి వార్ల దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను ప్రతి సంవత్సరం ఘనం గా నిర్వహించడం జరుగుతుంది. గతం లో కంటే ఈ సంవత్సరం మెరుగైన జరిగే విధంగా టెంపుల్ పరిసర ప్రాంతాలను, క్యూ లైన్లు, హోల్డింగ్ పాయింట్లు. స్నాన ఘాట్లను, పార్కింగ్ ప్రదేశాలు, ప్రసాదం కౌంటర్లు మరియు ఇతర ప్రదేశాలలో అన్ని శాఖల సమన్వయంతో పటిష్టమైన బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు అందరూ ఆనందోత్సవాలతో శాంతి భద్రతల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారి దర్శనం చేసుకోవాలనే ప్రధాన ఉద్దేశ్యంతో బందోబస్త్ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజశేఖర బాబు ఐ.పి.ఎస్. డి.సి.పి.లు గౌతమిశాలి ఐ.పి.ఎస్., టి.హరికృష్ణ, మరియు ఏ.సి.పి. డా.బి.రవికిరణ్ గారు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు, దేవస్థాన ఈ.ఓ రామారావు, ఇతర శాఖల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.