-నెట్వర్క్ ఆసుపత్రులపై నిఘా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణ జిల్లా డా” ఎన్టీఆర్ వైద్య సేవా పధకం క్రింద పని చేసే నెట్వర్క్ ఆసుపత్రులలో లో పేద రోగుల నుంచి డబ్బులు వసులు చేసినట్లు రుజువు ఐతే ఇకపై కఠిన చర్యలు తప్పవని 28-08-2024 బుధవారం జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ సూచనలమేరకు జరిగిన జిల్లా క్రమశిక్షణ సంఘం నసమావేశం లో జిల్లా లోని డా” ఎన్టీఆర్ వైద్య సేవల సమీక్షా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఘాటుగా స్పందించి పలుసూచనలు చేసారు . గతంలో ఆరోగ్యశ్రీ సీఈఓ గా పనిచేసిన అనుభవం తో జిల్లా లో పధకం యొక్క పనితీరు ఇతర అంశాలు క్షుణంగా పరిశీలించారు . కొన్ని ఆసుపత్రులలో రోగనిర్ధారణ నిమిత్తం డా “ఎన్టీఆర్ వైద్య సేవ లబ్దిదారులైన రోగులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి అవి నిర్ధారించి డీడీసీ కమిటీలో విచారణ జరిపి బాధ్యులైన యాజ్యమానానికి జరిమానావిధినాచాలని సూచించారు. ఎన్టీఆర్’వైద్య సేవ ఫథకం క్రింద ఏ ఒక్క రోగి ఇబంది పడిన సహించేది లేదు అని ఇకపైన రోగ నిర్దారణ నిమిత్తం రుసుము ఏ ఒక్క నెట్వర్క్ ఆసుపత్రిలో వసూలు చేసినట్లు తెలిసిన యాజమాన్యానికి నోటీసులు ఇవ్వాలని ఇది మరల పునరావృతం కారాదని ఆదేశించారు . డి ఎమ్ చ్ ఓ , డి సి హెచ్ ఎస్ , మరియు డా ” ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా సమానవ్యకర్త కలిసి ఆసుపత్రి రోగులను సందర్శించి తనిఖీలు చేసి వివరాలు సేకరించాలని తెలిపారు .
కమిటీ అంశాలు :
1. నెట్వర్క్ ఆసుపత్రులలో సీసీ కెమెరా ఆఫ్ ఉండరాదని తెలిపారు.
2. త్వరితగతిన అన్ని ప్రభుత్వ ప్రైవైట్ నెట్వర్క్ హాస్పిటల్స్ నందు ఐరిస్ మరియు థంబ్ కాప్చర్ బయోమెట్రిక్ డెవిస్స్ అందుబాటులో ఉంచాలి.
3. నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూనే వద్ద ఎన్టీఆర్ వైద్య సేవ లో నెట్వర్క్ హాస్పిటల్స్ నందు ఎటువంటి ఖర్చు నిమిత్తం డబ్బులు వాసులు చేయరాదు.
4. ఇకపై ఏటువంటి పిర్యాదులు అయినా డైల్ యువర్ సీఈఓ కార్యక్రమంలో భాగంగా నేరుగా వైద్య సేవ సీఈఓ శ్రీ లక్ష్మీశా గారికి ప్రతి మంగళవారం ఉదయం 10 గం ” నుంచి 11 గం ” వరకు ఫిర్యాదులు చేయవచ్చని తెలిపారు
5. వైద్య మిత్రలు తమ పని సమయం లో ఎటువంటి అలసత్వ్యం ప్రదర్శించరాదని ,రోగికి వైద్య సేవలు సక్రమంగా అందించటంలో ఆసుపత్రులలో తమవంతు భగంగా పని చేయాలనీ హెచ్చరించారు .
6. 108,104,102 వాహనాలు పని తీరు వాహన తనిఖీలు ఎప్పటికపుడు నిర్వహించి నివేదిక అందచేయాలని కోరారు .
ఈ కార్యక్రమములో డి ఎమ్ చ్ ఓ డా. గీతాబాయి, డి సి హెచ్ ఎస్ డా. శ్రవణ్ కుమార్, ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా సమన్వయకర్త డా. సతీష్ కుమార్ మరియు కమిటీ సభ్యులు డా. కేశవ కృష్ణ పాల్గొన్నారు.