Breaking News

28 నిల్వ కేంద్రాలలో అందుబాటులో ఉన్న ఇసుక 14,20,079 మెట్రిక్ టన్నులు

-రాష్ట్ర గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత ఇసుక మంగళవారం ఉదయానికి 28 ఇసుక నిల్వ కేంద్రాలలో 14,20,079 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉందని వాణిజ్య పన్నుల శాఖ ఛీప్ కమీషనర్, గనులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. 2,775 మెట్రిక్ టన్నుల ఇసుక కోసం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 339 మంది దరఖాస్తు చేసుకోగా, వారితో పాటు పెండింగ్ లో ఉన్న 163 దరఖాస్తుదారులకు 2,139 మెట్రిక్ టన్నులు, వెరసి మొత్తంగా 502 మంది దరఖాస్తుదారులకు 4,914 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసామని మీనా వివరించారు. పలు చోట్ల రహదారులు దెబ్బతిన్న పరిస్ధితిలో ఇసుక రవాణా పరంగా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని వినియోగదారులు తమవంతు సహకారం అందించాలని విన్నవించారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో ఇసుక నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయని, వర్షాకాలం ముగిసిన తరువాత ఇసుక నిల్వలకు కొరత ఉండబోదన్నారు. వివిధ రీచ్ ల నుండి సరఫరా నిలిచిపోయిందని, వర్షాలు తగ్గి, రవాణా పరిస్ధితులు మెరుగైన తురువాత పూర్తి స్ధాయిలో ఇసుక అందుబాటులోకి వస్తుందని మీనా వివరించారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *