విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్థి పన్ను బకాయిదారులు అందరూ తమ తమ ఆస్థి పన్ను, కుళాయి చార్జీలు, డ్రైనేజి చార్జీలు, వాటర్ మీటర్ చార్జీలు మరియు ఖాళీ స్థలముల పన్నులను ఈ అర్ధ సంవత్సరం ది.30-09-2024 లోపు చెల్లించి నగరాభివృద్ధికి సహకరించవలసినదిగాను, మరియు తదుపరి విధించబడు పెనాల్టి నుండి ఉపశమనం పొందవలసినదిగా కోరడమైనది. ప్రజల సౌకర్యార్ధo విజయవాడ నగరపాలక సంస్థ పరిధి లోని 3 సర్కిల్ కార్యాలయములలోను మరియు విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం లోను ఉదయం 8.00 గంటల నుండి రాత్రి 8.00 గంటల వరకు అన్ని శెలవు దినములలో కూడా తెరచి ఉంచబడునని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ప్రకటనలో తెలియజేశారు.
Tags vijayawada
Check Also
సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య ఘర్ పథకం ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకునేలా వారికి బ్యాంకు …