Breaking News

ప్రమాదకర పరిశ్రమల్లో మూడు నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ తప్పక జరగాలి: సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వివిధ ప్రమాదకర పరిశ్రమల్లో మూడు మాసాలకు ఒకసారి తప్పకుండా సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పటిష్టంగా అమలు చేయడం ద్వారా నిర్దిష్ట లక్ష్యాలను సాధించాలని ఆయన స్పష్టం చేశారు.మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన ఐటిఇఅండ్సి, ఎన్ఆర్ఐ ఎంపర్మెంట్, టూరిజం అండ్ కల్చర్, సినిమాటోగ్రఫీ, పరిశ్రమలు,వాణిజ్యం,కార్మిక, ఫ్యాక్టరీలు తదితర విభాగాల అధికారులతో సమీక్షించారు.
ఈసందర్భంగా పరిశ్రమల శాఖకు సంబంధించి మాట్లాడుతూ ప్రమాదకర పరిశ్రమల్లో మూడు నెలలకు ఒకసారి సేఫ్టీ ఆడిట్ ను తప్పక నిర్వహించాలని సిఎస్ ఆదేశించారు. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు అవసరమైన ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టి అమలు చేసిన వివిధ పథకాలు, కార్యక్రమాలను పూర్తిగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని సిఎస్ పేర్కొన్నారు. ఇంకా ఈసమావేశంలో పలు అంశాలపై సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ఈసమావేశంలో ఐటి శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్, పర్యాటక శాఖ ఇన్చార్జి ఎండి అభిషిక్త్ కిషోర్ పాల్గొన్నారు. అలాగే ఎస్.సురేశ్ కుమార్, పరిశ్రమలు,వాణిజ్య శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి విజయకుమార్ వర్చువల్ గా పాల్గొన్నారు.

Check Also

సివిల్ సప్లైస్ హమాలీల కూలీ రేటు 25 రూపాయల నుంచి 28 రూపాయిలకు పెంపు

-జేఏసీ నాయకులతో కుదిరిన ఒప్పందం – సమ్మె విరమణ -తద్వారా 5791 మంది ముఠా కార్మికులకు లబ్ధి -ఆహారం,పౌరసరఫరాల మరియు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *