విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకి బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ లో నిరసనలు తెలియచేసారు. రాహుల్ గాంధీ పై ధ్వజమెత్తిన కర్నాటక బిజెపి ఎం పి ముని స్వామి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తానన్న రాహుల్ గాంధీ పై కేసులు నమోదు చేయాలన్నారు. ఇతర దేశాల్లో భారత్ ను తక్కువ చేసి మాట్లాడటం. ఉన్న రిజర్వేషన్ లను రద్దు చేయాలని దుర్మార్గానికి రాహుల్ ప్రయత్నం చేస్తున్నాడన్నారు. చైనా, పాకిస్థాన్ కు రాహుల్ అనుకూలంగా ఉన్నాడన్నారు.
ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దేవానంద్ మాట్లాడుతూ… అమెరికా జార్జ్ విశ్వావిద్యాలయంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారత దేశం లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్స్ ని తీసేస్తామని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల పై దేశ వ్యాప్తంగా బీజేపీ నిరసనలు తెలియచేస్తున్నామన్నారు. కుట్ర రాజకీయాలు అంతం పలకాలని ఎస్సీ మోర్చా నుంచి నిరసనలు ఉంటాయన్నారు. గతం కాంగ్రెస్ పాలనలో లక్షలాది మంది దళితులు రోడ్డు పైన పడ్డారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ ఆశయాలు అనుగుణంగా ప్రధాని మోదీ పని చేస్తున్నారన్నారు. విదేశీ గడ్డ పై భారతీయ దళితులని అనగదొక్కే విధంగా కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలని ఖండిస్తున్నామన్నారు.
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం , ఎస్సీ మోర్చా రాష్ట్ర నేతలు ,మోజీ,సి బాబు, శాంత కుమార్, జయలక్ష్మి, కాళేశ్వరరావు, అంబేద్కర్, విశ్వనాథ్, లెనిన్ బాబు,సాకే శివశంకర్, శ్రీ నివాస్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.