–సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచన ఉత్తమమైంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో లయన్స్ క్లబ్స్ వారితో వరుణ్ వారు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఉత్తమమైనవని లయన్స్ జిల్లా 316డి ఫస్ట్ వైస్ గవర్నర్ వి.వి.పి.ఎస్. ఆంజనేయులు చెప్పారు. ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ మిరియాల వెంకటేశ్వరరావు ఎన్నో సంవత్సరం నుండి ఈ విధంగా వరుణ్ మోటార్స్ లైన్స్ బ్లడ్ బ్యాంకు తో కలిపి ఈ విధంగా రక్తదానం శిబిరం నిర్వహించటం చాలా ఆనందదాయకం అంతేకాక ప్రభు కిషోర్ బర్త్డే సందర్భంగా వేరే ఎటువంటి కార్యక్రమాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే రక్తదాన శిబిరాలు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ జరపటం మొదలగు చక్కటి కార్యక్రమాలు చేయడం ఒక్క వరుణ్ మోటార్స్ అధినేత ప్రభు కిషోర్ కి మాత్రమే చేయగలుగుతున్నారు అని చెప్పారు. లయన్స్ క్లబ్ విజయవాడ జూబ్లీ హరిత, వరుణ్ మోటార్స్ ప్రవేట్ లిమిటెడ్ సంయుక్తం ఆధ్వర్యంలో వరుణ్ మోటార్స్ అధినేత ప్రభు కిషోర్ పుట్టినరోజు సందర్భంగా బెంజి సర్కిల్ బందర్ రోడ్డులోని వరుణ్ మోటార్స్ దగ్గర పలు సేవా కార్యక్రమాలు శనివారం ఉదయం జరిగాయి. రక్తదానం శిబిరం, మొక్కల పంపిణీ, అవయవదానం, క్యాన్సర్‌పై అవగాహనా ర్యాలీ జరిగింది.
సమాజంలో నిజంగా సహాయం అవసరమైన వారిని గుర్తించి వారికి ఉపయోగపడేలా లయన్స్ క్లబ్ కార్యక్రమాలు ఉంటాయన్నారు. వరుణ్ అధినేత ప్రభు కిషోర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రతి ఏడాది రక్తదానం శిభిరం నిర్వహించడం నిజంగా అభినందనీయమన్నారు. రక్తదానం చేయడం అంటే ప్రాణదానం చేయడమేనని చెప్పారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నామమాత్రపు ధరకు రక్తం అవసరమైన వారికి అందచేస్తారని రిటైర్డ్ పోలీస్ డీసీపీ డాక్టర్ టి.హరికృష్ణ తెలియజేశారు తాను ఇప్పటి వరకు పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేశానని, ఇప్పుడు రిటైర్డ్ అయి లయన్స్ క్లబ్ మరియు వరుణ్ మోటార్స్ వారి ద్వారా ప్రజలకు మరింతగా చేరువ అయ్యి సమాజానికి సేవ చేస్తున్నానని చెప్పారు. ప్రజలకు నేరుగా సేవ చేయడంలోనే నిజమైన ఆనందం ఉందన్నారు.
వరుణ్ మోటార్స్ ప్రతి సంవత్సరం రక్తదానం శిబిరాన్ని నిర్వహించడం, ఈ కార్యక్రమంలో తమ సంస్థ సభ్యులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని లయన్స్ క్లబ్ అధ్యక్షులు బెల్లంకొండ శ్రీనివాస్ ప్రసాద్ చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని జయప్రదం గా జరగటానికి ముఖ్య కారకులు, యోగా గురువు అంకాల సత్యనారాయణ, కే సాయి బాబా కాకాని శ్రీనివాస్ పొన్నాడ ఈశ్వర చారి మరియు వరుణ్ మోటార్స్ స్టాప్ ఉత్సాహంగా పాల్గొన్నారు.