Breaking News

కొండపి నియోజక వర్గం, తుర్పునాయుడుపాలెం గ్రామంలో పలు కార్యక్రమాలు

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త:
మాజీమంత్రి కీ.శే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు  17వ వర్ధతిని పురస్కరించుకొని కొండపి నియోజక వర్గం, తుర్పునాయుడుపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నరసరాపుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, ఒంగోలు , గిద్దలూరు, సర్వేపల్లి, కందుకూరు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, ముతుముల అశోక్ కుమార్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,  ఇంటూరు నాగేశ్వర రావు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను, మెగా మెడికల్ క్యాంపు ను, 15 లక్షలతో ఎస్.సి కాలనీలో నిర్మించిన అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించడంతో పాటు, 4.50 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా స్వర్గీయ డా. బి. ఆర్. అంబేద్కర్, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మొక్కలను కూడా నాటారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ, కీ.శే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు వర్ధంతికి దాదాపు 17 సంవత్సరాల తరువాత కూడా ఇంతపెద్ద ఎత్తున ప్రజలు, అభిమానులు తరలిరావడం ఆయన జిల్లా మరియు కొండపి నియోజక వర్గానికి చేసిన సేవలకు గుర్తింపు అని, ప్రజల మనస్సు ల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్వక్తి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులని అన్నారు. వారి వర్ధంతి సందర్భంగా ఈ రోజు మెగా జాబ్ మేళా, మెగా మెడికల్ క్యాంప్, అన్నదాన కార్యక్రమం వంటి చాలా మంచి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంత్రిగా తొలి సంతకం ఈ గ్రామంలో సబ్ స్టేషన్ మంజూరు పై పెట్టడం జరిగిందని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్య ఘర్ పధకం అమలుకు సంబంధించి తుర్పునాయుడుపాలెం గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గ్రామంగా ఎంపిక చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల పాలనలో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, రానున్న రోజుల్లో పేద ప్రజల సంక్షేమానికి మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని మంత్రి రవికుమార్ తెలిపారు.

రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, ఈ గ్రామంలో పుట్టి రైతు కుటుంబం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పర్యాయాలు మంత్రిగా ఎనలేని సేవ చేసినటు వంటి వ్యక్తి కీ.శే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు 17 వ వర్దంతి సందర్భంగా మల్లవరప్పాడు గ్రామంలో కీ.శే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు మరియు మాజీ ముఖ్యమంత్రి కీ. సే. స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలను ఆవిష్కరించుకోవడం చాల సంతోషమన్నారు. పిడిసిసి బ్యాంకు చైర్మన్ గా వున్నప్పుడు రుణాలను రీ షెడ్యుల్ చేయడంలోనూ, మార్కెటింగ్ శాఖామంత్రి గా వున్నప్పుడు ఈ ప్రాంతంలో సుబాబుల్, జామాయిల్ కు మంచి రేటు కల్పించిన ఘనత స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారికి దక్కుతుందన్నారు. కందుకూరు, కొండపి కి లింక్ రోడ్ల నిర్మాణాలలోను, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో తన ముద్ర చూపి, విలువలతో, నీతినిజాయితీ తో రాజకీయాలు చేసి భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు అని మంత్రి డా. శ్రీ బాల వీరాంజనేయ స్వామీ అన్నారు. ఆయన స్పూర్తితో కొండపి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే ఈ గ్రామంలో 60 లక్షలతో అంతర్గత సిమెంట్ రోడ్లను ప్రారంభించుకోవడం జరిగిందని, అలాగే 4.50 కోట్ల రూపాయలతో 33/11 విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. 3 వేల రూపాయల పెన్షన్ ను 4 వేలకు పెంచడం జరిగిందన్నారు. రానున్న దీపావళి పండుగ నుండి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. సూర్య ఘర్ పధకం కింద తూర్పు నాయుడుపాలెం గ్రామాన్ని ఎంపిక చేయాలని ఈ సందర్భంగా మంత్రి డా. స్వామి , విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను కోరడం జరిగింది. రానున్న రోజుల్లో నియోజక వర్గంలో మిగిలిపోయిన సైడ్ డ్రైన్స్, రోడ్లను పూర్తీ చేసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, దామచర్ల కుటుంబాలకు, మాగుంట కుటుంబాలను మంచి అనుబంధం వుందని, కీ.శే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 17వ వర్ధంతికి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు, వారి అభిమానులు రావడం వారి వ్యక్తిత్వం, మంచి తనానికి నిదర్శనం, వారి ఆశయాలను వారి మనవళ్ళు దామచర్ల జనార్ధన్ రావు, దామచర్ల సత్య కొనసాగిస్తూ ఈ రోజు మెగా జాబ్ మేళా, మెగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు.

నరసరాపుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు మాట్లాడుతూ, కీ.శే స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారు వివిధ పదవులతో పాటు మంత్రి గా ఆయన చేసిన పనులు, సేవలను నేటి యువత స్పూర్తిగా తీసుకొని ముందుకు పోవల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో జిల్లా కు మంచి జరిగిందని, వెనుకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లాను ప్రకటించడం వలన జిల్లా మరింతగా అబివృద్ది చెందే అవకాశం ఉందన్నారు.
ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ, కొండపి నియోజక వర్గంలోని ప్రతి గ్రామంలో ప్రజలు గుర్తుపెట్టుకునేలా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారని, వారిని ఆదర్శంగా తీసుకొని మేము కూడా మచ్చలేని కుటుంబంగా ఆయన ఆశయాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జిల్లాను అన్నీ రంగాల్లో ముందుకు తీసుకు వెళ్ళేలా తమవంతు కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో గిద్దలూరు, కందుకూరు, పర్చూరు శాసన సభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి , ఇంటూరు నాగేశ్వర రావు, ఏలూరు సాంబశివరావు, ఒంగోలు నగర మేయర్  గంగాడ సుజాత, మాజీ శాసన సభ్యులు దివి శివరామ్,  పోతుల రామారావు, వై.పాలెం, దర్శి నియోజక వర్గాల ఇంచార్జీలు శ్రీ గుడూరి ఎరిక్షన్ బాబు, డా. శ్రీలక్ష్మి తదితరులు పాల్గొని మాట్లాడుతూ, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు వ్యక్తిత్వాన్ని, పిడిసిసి బ్యాంకు చైర్మన్ గా, మంత్రిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకొంటూ నేటి యువత ఆయన్ని వారిని స్పూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమాల్లో దామచర్ల సత్య, నియోజక వర్గ స్థాయి ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు  అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తొలుత మల్లవరప్పాడులో నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు మరియు మాజీ మంత్రి స్వర్గీయ దామచర్ల ఆంజనేయుల విగ్రహాలను రాష్ట్ర మంత్రులు డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి,  గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు, నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి, లావు శ్రీకృష్ణ దేవరాయలు, ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ రావు, టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఒంగోలు నగర మేయర్ శ్రీమతి సుజాత, దామచర్ల సత్య తదితరులు ఆవిష్కరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *