విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీని అమలు చేయడం పట్ల లక్షా 10 వేల మాజీ సైనిక కుటుంబాల తరఫున కూటమి ప్రభుత్వానికి ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు సోమవారం పోరంకిలోని తమ కార్యాలయంలో మాట్లాడుతూ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లక్షా పదివేల కుటుంబాలు వీరి ఓట్లు సుమారు పది లక్షలు పైనే ఓటర్లు ఉన్నారు అయినా కూడా గత ప్రభుత్వంలో మాజీ సైనికుల సమస్యలను అసలు పట్టించుకోలేదని, ఇప్పటి ప్రభుత్వం మాజీ సైనికులకు కొద్దిపాటి సమస్యలు పరిష్కరించే అంశంపై చర్చించేందుకు మర్యాదపూర్వకంగా కలిశామని తెలిపారు. మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వై.రమేష్‌కుమార్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
విఎంసి సిబ్బందికు సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణ కార్యక్రమం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం …