Breaking News

నగర సుందరీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి…

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నగర సుందరీకరణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని వారి ఛాంబర్లో మునిసిపల్ అధికారులు, ముడా అధికారులతో కలిసి మచిలీపట్నం అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముడా పరిధిలోని పోర్టు డంప్యార్డు లేఔట్లు ఉన్న రేఖా చిత్రపటాన్ని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి డివైడర్ లపై వివిధ కళాకృతులతో రంగులను వేయించేందుకు టెండర్లను పిలవాలన్నారు. అంతేకాకుండా వివిధ ప్రదేశాల్లో ఉన్న లలిత కళల (ఫైన్ ఆర్ట్స్) కళాశాల విద్యార్థులను పిలిపించి వారి చేత రహదారి డివైడర్లపై వివిధ రకాల కళాకృతులను ఆకట్టుకునే విధంగా రంగులు వేయుట కు కృషి చేయాలన్నారు. ఇందుకోసం ముందుగా రంగులు వేసే స్థలాలను గుర్తించాలన్నారు. ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రకారం అమలు చేయాలన్నారు. అలాగే కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో వాహనాల వ్యర్థ పరికరాలు సామాగ్రితో కూడా విజయవాడలో మాదిరిగా

కళాకృతులు రూపొందించి ఏర్పాటు చేయాలన్నారు. ప్రస్తుతం నగరంలో ఆంధ్ర జాతీయ కళాశాల సమీపంలో చల్లపల్లి మార్గంలో ఉన్న డంపింగ్ యార్డ్ లో పర్యావరణ నివేదిక ప్రకారం ఉన్న లక్ష టన్నుల చెత్తాచెదారాలను తొలగించి శుభ్రం చేయుటకు స్వర్ణాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కు, మున్సిపల్ పరిపాలన కమిషనర్ కు లేఖలు రాసి అనుమతులు నిధులు మంజూరయ్యేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అసలు నగరంలో వాస్తవంగా రోజుకు ఎంత చెత్త సేకరిస్తున్నారు, గురువారం పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు.

అందులోంచి ప్రతిరోజు 18 టన్నుల పొడి చెత్త వేరు చేసి గుంటూరులోని జిందాల్ కంపెనీకి 2 కంపాక్టర్లు ద్వారా పంపడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కలెక్టర్కు వివరించారు. అసలు నగరంలో వాస్తవంగా రోజుకు ఎంత చెత్త సేకరిస్తున్నారు ఎంత వినియోగిస్తున్నారు ఎంత మిగులుతుంది అనే వివరాలు ఈ గురువారం పరిశీలించి నివేదిక అందజేయాలన్నారు నగరంలో సేకరించిన చెత్తాచెదారాల్లో తడి చెత్త పొడి చెత్తలను వేరు వేరు చేయాలన్నారు ఇందుకోసం వెండార్లు సిద్ధంగా ఉన్నారని వారికి స్థలం గుర్తించి అప్పగించాల్సిన అవసరం ఉందన్నారు. బందరు పోర్టు నుండి ప్రతిరోజు 25వేల క్యూబిక్ మీటర్ల వ్యర్ధాలు వస్తున్నాయని వాటిని వినియోగించి లోతట్టు ప్రాంతాలు పూడ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు ముడా డిప్యూటీ కలెక్టర్ పద్మావతి మునిసిపల్ ఈ ఈ లు భూషణం శ్రీకాంత్ ప్రజారోగ్య ఈ ఈ రాంప్రసాద్ సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్ మూడ సర్వేయర్ శివ తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *