-ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరణ
-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న 729 బోధనేతర (నాన్ టీచింగ్) సిబ్బంది పోస్టులను పొరుగుసేవల (ఔట్ సోర్సింగ్) ప్రాతిపదికన 2024-25 విద్యా సంవత్సరం (ఒక సంవత్సరం) కాలానికి భర్తీ చేయడానికి అర్హులైన మరియు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఈ నెల 7వ తేదీ నుండి ఈ నెల 15వ తదీ వరకు స్వీకరించబడును. ఆసక్తిగల అభ్యర్థులు తమ దరఖాస్తులను మండల విద్యాశాఖాధికారి కార్యాలయం లో ఆఫ్ లైన్ ద్వారా అందజేయాలి.
ఖాళీలు వివరాలిలా..
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టైప్ 3 కేజీబీవీల్లో 547 పోస్టులకు గాను హెడ్ కుక్ 48, అసిస్టెంట్ కుక్ 263, డే & నైట్ వాచ్ ఉమెన్ 95, స్కావెంజర్ 79, స్వీపర్ 62 ఖాళీలు ఉన్నాయి. టైప్ 4 కేజీబీవీల్లో 182 పోస్టులకు గాను హెడ్ కుక్ 48, అసిస్టెంట్ కుక్ 76, చౌకీదార్ 58 పోస్టులు భర్తీ చేయనున్నారని తెలిపారు.
ఎంపిక ప్రక్రియ ఇలా:
1) జిల్లా స్థాయిలో మరియు మండల స్థాయిలో పేపర్ నోటిఫికేషన్ విడుదల 07-10-2024
2) మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఆఫ్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ 07-10-2024
15-10-2024 వరకు
3) మండలాల వారీగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల జాబితా తయారీ 16-10-2024
4) మండలాల నుండి 17-10-2024న సమగ్ర శిక్షా జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్ (APC) కార్యాలయానికి దరఖాస్తుల సమర్పణ
5) 18-10-2024న జిల్లా స్థాయిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల తుది జాబితా తయారీ.
6) 21-10-2024న ఆమోదం కోసం జిల్లా స్థాయి ఎంపిక కమిటీ ముందు ఉంచడం
7) APCOS ఛైర్మన్‌కి ఎంపిక జాబితాల సమర్పణ 22-10-2024
8) డ్యూటీకి రిపోర్టింగ్ 22-10-2024.