Breaking News

నిర్ణీత లక్ష్యాలను సమన్వయంతో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలి….

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వపరంగా నిర్ణీత లక్ష్యాలను సమన్వయంతో పూర్తిచేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ నగరంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం ముందు జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చాలామంది జిల్లా అధికారులు బదిలీపై కొత్తగా జిల్లాకు వచ్చారన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారి పరిధిలో ప్రతిరోజు లేదా రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా వారి కార్యకలాపాలను సమీక్షించుకోవాలన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే వారి స్థాయిలో పరిష్కరించాలన్నారు.

వారి స్థాయిలో పరిష్కరించలేని సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలన్నారు. రాష్ట్రస్థాయిలో అక్కడి అధికారులు శాఖా పరంగా సమీక్షలు నిర్వహించినప్పుడు లక్ష్యాలు, సాధించినవి, వాటి లోటుపాట్లు ఏమైనా ఉంటే తగిన విధంగా సరి చేసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారి శాఖకు సంబంధించి అంశాల పైన సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా అధికారుల వాట్స్అప్ గ్రూప్లో తాను సూచనలు పెట్టినప్పుడు వాటికి సంబంధించిన అధికారులు నేరుగా తనకు వాట్సాప్ గ్రూప్ లో సమాధానం పంపాలన్నారు.

ఉద్యోగుల ఇంక్రిమెంట్లు, మెడికల్ రీయంబర్స్మెంట్లు, పదోన్నతులు వంటి సమస్యలను కూడా సంబంధిత జిల్లా అధికారి పరిష్కరించాలన్నారు. ప్రతి అధికారి వారి శాఖలో చేపట్టవలసిన పనులకు సంబంధించి కావాల్సిన సామాగ్రిని, అనుసరించిన పద్ధతులను, అందుకు అవసరమయ్యే వ్యక్తులను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ప్రతి జిల్లా అధికారి వారి శాఖకు సంబంధించిన చెక్ లిస్టు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రజా ప్రతినిధులతో సత్సంబంధాలు కలిగి ఉండి వారు తెలియజేసే ప్రజల సమస్యలను సానుకూల దృక్పథంతో ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. ప్రతి ప్రభుత్వ శాఖ జిల్లా అధికారి వారంలో రెండు రోజులు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి శాఖ పరంగా వారి పరిధిలో ఏమి జరుగుతోంది, ఏ సమస్యలు ఉన్నాయి, అనే విషయాలను తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. ఏదైనా సమస్య ఉంటే తనతో నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చన్నారు. ప్రభుత్వ శాఖల మధ్య ఏమైనా అంతర్గత సమస్యలు ఉంటే సంబంధిత శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో పరిష్కరించుకోవాలన్నారు.

కోర్టు కేసులకు సకాలంలో స్పందించి ఆఫిడవిట్లు వేయాలన్నారు. కేసు పడిన వెంటనే సూచనలు పంపించిన ఎడల దాన్ని దాన్ని తొలి దశలోనే అనుమతించకుండా ఆగిపోతాయన్నారు. కోర్టు చివరి ఉత్తర్వులు వచ్చినప్పుడు దానిని అమలు చేయడం గాని, అప్పీల్ చేయడం గాని ఏదో ఒకటి తప్పనిసరిగా చేయాలన్నారు. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణకు పాల్పడితే కలెక్టర్ని బాధ్యులుగా చేస్తే సంబంధిత జిల్లా అధికారిని ఉపేక్షించేది లేదని వారికి షోకాస్ నోటీసు జారీ చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, కె ఆర్ ఆర్ సి ఎస్డిసి శ్రీదేవి, మచిలీపట్నం ఆర్డిఓ స్వాతి,జడ్పీ సీఈవో కే కన్నమ నాయుడు, ద్వామా పీడీ శివప్రసాద్, జిల్లా గృహ నిర్మాణ అధికారి ఎస్ వెంకట్రావు, జిల్లా పశుసంవర్ధక అధికారి చిన్న నరసింహులు, పౌరసరఫరాల డీఎం సృజన, ఆర్ అండ్ బి అధికారి లొకేష్ , జిల్లా రిజిస్టార్ గోపాల కృష్ణమూర్తి, డిటిడబ్ల్యూ ఫణి ధూర్జటి, విద్యుత్ శాఖ ఈఈ శ్రీనివాసరావు,డి ఎం హెచ్ ఓ డాక్టర్ గీత భాయి, డీఎస్ఓ పార్వతి, డిఇఓ తహేరా సుల్తానా తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

సూర్య ఘర్ పధకం లక్ష్యం ప్రయోజనాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పీఎం సూర్య ఘర్ పథకం ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకునేలా వారికి బ్యాంకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *