-సఫాయీ కార్మికులకు సంక్షేమ పధకాలు సక్రమంగా అమలు చేయాలి
-జాతీయ సఫాయీ కర్మచారీ కమిషన్ చైర్మన్ ఎం వెంకటేశన్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) హాస్పిటల్ ను 19.10. 2024వ తేది శని వారం సాయంత్రం 5 గంటలకు జాతీయ సఫాయీ కర్మచారీ కమిషన్ చైర్మన్ ఎం. వెంకటేశన్ స్విమ్స్ ను సందర్శించారని మెడికల్ సూపరింటెండెంట్ డా రామ్ తెలియజేశారు.
స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డా॥ ఆర్.వి.కుమార్, జాతీయ సఫాయి కర్మచారి. కమిషన్ చైర్మన్ వెంకటేశన్ కి స్వాగతం పలికారు, స్విమ్స్ లో సఫాయీ కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
పద్మావతి మహిళా వైద్య కళాశాల లెక్చర్ గ్యాలరీ-1లో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషన్ చైర్మన్, స్విమ్స్ అధికారులు. సఫాయీ కార్మికులు, కర్మచారీ సంఘం నాయకులతో సమావేశమై సఫాయీ కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇఎస్ఐ, పిఎఫ్ కార్డులు ఇచ్చారా? జీతాలు సక్రమంగా చెల్లిస్తున్నారా? తదితర విషయాలను కార్మికులను అడిగి విచారించారు. వృత్తి పరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. తమకు ఇక్కడ ఎలాంటి. ఇబ్బందులు, సమస్యలు లేవని వారు పేర్కొన్నారు. అధికారుల నుండి తమకు ఎలాంటి ఒత్తిళ్లు, ఇబ్బందులు లేవని వారు చెప్పారు. స్విమ్స్ కార్మికుల సంక్షేమానికి చేపడుతున్న చర్యల పట్ల కమీషన్ చైర్మన్ వెంకటేషన్ సంతృప్తి వ్యక్తం చేసి, మరిన్ని మెరుగైన సేవలు అందించాలని సూచించారు. సఫాయీ కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించి అని సక్రమంగా అమలు జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. స్విమ్స్ ఆస్పత్రి కళాశాల, పరిసరాలలో పారిశుధ్య నిర్వహణ బాగుందని చైర్మన్ మెచ్చుకున్నారు. ఇందులో భాగంగా కార్మికులకు సమస్యలు వున్న యెడల తన కార్యాలయానికి ఈ ఫోన్ నెం: 011-24648924 ద్వారా సంప్రదించాలని సూచించారు. అంతకు ముందు రూయా ఆస్పత్రిలో అధికారులు సఫాయీ కార్మికులు, కార్మిక సంఘం నాయకులతో చైర్మన్ వెంకటేశన్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా॥ రామ్, ఆర్.ఎం.ఓ. డా|| కోటిరెడ్డి, టి.టి.డి. లక్ష్మి శ్రీనివాసా మ్యాన్ పవర్ కార్పొరేషన్ (టిటిడి) జనరల్ మేనేజర్ రామ్ కుమార్, టిటిడి సివిల్ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాలాజి, స్విమ్స్ జనరల్ మేనేజర్ బాబు, అసిస్టెంట్ డైరెక్టర్ వి.రాజశేఖర్, శానిటరీ ఇన్స్టిక్టర్లు సఫాయి కార్మికులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.