Breaking News

పోషన్ వాటికాస్ కాంపోనెంట్ సద్వినియోగం చేసుకోవాలి

-మొక్కలు పెంపకం కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.10 వేలు మంజూరు
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోషన్ వాటికాస్ కాంపోనెంట్ కింద ప్రతి అంగన్వాడీ కేంద్రానికి రూ.10,000/- నిధులను విడుదల చెయ్యడం జరుగుతోందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు.
శనివారం నగరంలోని సిగిడిల పేట, బాలజీపేట లలో ఉన్న నాలుగు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ , పోషన్ వాటికాస్ కాంపోనెంట్‌ను ప్రతి అంగన్వాడీ కేంద్రంలోని సెక్టార్ సూపర్‌వైజర్ పర్యవేక్షణలో కార్యకలాపాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో భాగంగా 8 రకాల ఆకుకూరలు, అశ్రు రకాల కూరగాయలు అంగన్వాడీ కేంద్రాల్లో పెంచాల్సి ఉంటుందన్నారు. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతి కేంద్రానికి రూ. పది వేలు చొప్పున నిధులను మంజూరు చేసినట్లు తెలిపారు.
వాటిని అంగన్వాడీ వర్కర్ ఏర్పాటు చేసి పరిరక్షణా బాధ్యతలు నిర్వహించాలాన్నారు. ఇందు నిమిత్తం అంగన్వాడీ వర్కర్స్ బ్యాంకు ఖాతాకు నిధులను జమ చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రం ఆవరణలో లేదా అంగన్‌వాడీ కేంద్రానికి సమీపంలో ఉన్న స్థలం లభ్యతను బట్టి పోషణ వాటిక/కిచెన్ గార్డెన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఆవరణలో లేదా అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో స్థలం లేని కేంద్రాల్లో కూరగాయలు, పచ్చి కూరగాయలు తదితరాలను పండించడానికి కంటైనర్ గార్డెనింగ్ లేదా కుండ తోటపని ఏర్పాటు చేయాలనీ కలెక్టర్ సూచించారు. కంటైనర్ గార్డెనింగ్‌ విధానంలో భూమికి బదులుగా కంటైనర్/కుండీలలో మొక్కలను పెంచడం ఒక భాగం అని తెలియ చేశారు.

యూనిట్ ఖర్చు 10 వేల రూపాయలతో పచ్చని ఆకు కూరలు (8 రకాలు), ఔషధ మొక్కలు/ పండ్ల చెట్లు (5 లేదా 6 చెట్లు) పెంచాల్సి ఉంటుందనీ కలెక్టర్ తెలిపారు.

ఆకు కూరలు విభాగంలో పాలకూర, మెంతి, అమరంథస్, తోటకూర , గుంటకలగారాకు (BRAMHI) , పునర్నవ (బోయర్హవియా) , డయోస్కోరియా (Ratalu), వంటి ఆకు కూరలు, ఔషధ మొక్కలు/ పండ్ల చెట్లు విభాగంలో
మోరింగా (సహజన్), పపిట (బొప్పాయి} , కరిపట్ట నిమ్మకాయ , ఉసిరి , పూనిక (అనార్) మొదలైన వాటిని పెంచాల్సి ఉంటుందన్నారు.

అంగన్వాడీ కేంద్రాల్లో సిగిడిల పేట 1 కేంద్రానికి 18 మందికి గానూ 14 మంది , సిగిడిల పేట 2 కేంద్రానికి 18 మందికి గానూ 11 మంది , బాలాజీపేట 1 కేంద్రానికి 18 మందికి గానూ 13 మంది , బాలాజీ పేట 2 బాలజీపేట కేంద్రానికి 9 మందికి గానూ 9 మంది హాజరు కావడం గుర్తించారు. తక్కువ హాజరు శాతం ఉన్న కేంద్రాలలో 100 శాతం హాజరు కావాల్సి ఉంటుందన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, రక్తహీనత అనీమియా వంటి వాటికీ పరిష్కార మార్గం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పోషన్ వాటికాస్ కాంపోనెంట్‌ను ప్రతి అంగన్వాడీ కేంద్రంలో సమర్ధవంతంగా అమలు చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా పలువురు చిన్నారులు కలెక్టర్ కు పుష్పగుచ్చం అందచేశారు. కలెక్టర్ వెంట ఐసిడిఎస్పిడి కే. విజయకుమారి , సిబ్బంది ఉన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *