రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
రెవిన్యూ గ్రామ సభలు నిర్వహించే క్రమంలో సంబంధిత గ్రామాలకు చెందిన రెవిన్యూ రికార్డులతో హజరు కావాలని , ఫిర్యాదులు చేసే వ్యక్తులు నిర్ధారిత పత్రాలు తీసుకొని రావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.
మంగళవారం రాజానగరం మండలం నామవరం గ్రామంలో రీ సర్వే గ్రామ సభకు కలెక్టర్ హాజరుకావడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి రైతులతో, భూ యజమానులతో ముఖా ముఖి మాట్లాడుతూ, రీ సర్వే ప్రాజెక్ట్ లో భాగంగా సర్వే పూర్తి అయిన గ్రామాల్లో వివిధ భూ సమస్యలపై గ్రామ సభలు నిర్వహించడం జరుగుతోందని తెలిపారు. సంబంధిత గ్రామ సభలకు హజరయ్యే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్వహిస్తూ భూ రికార్డులతో హజరు కావాలని ఆదేశించారు. రీ సర్వే లో తలెత్తిన సమస్యలు పరిష్కారం దిశగా ఈ గ్రామ సభలు వేదికగా నిలుస్తాయని పేర్కోన్నారు. రీ సర్వే జరిగిన గ్రామాలలో అభ్యంతరాలు పై భూమి వాస్తవ కొలతలకు, డాక్యుమెంట్ ప్రకారం ఉన్న కొలతలు, రీ సర్వే సందర్భంగా ఉన్న కొలతలు ఆధారంగా పరిశీలన చెయ్యడం జరుగుతుందన్నారు. సంబంధిత ఆర్జిదారులు సామూహిక పత్రం (కలెక్టివ్ డాక్యుమెంట్) తో రీ సర్వే గ్రామ సభలకు హాజరు కావాలని, గ్రామ సభలో చూపించాల్సి ఉంటుందని కోరడం జరిగింది. గ్రామ కంఠం భూములుకు చెందిన ఫిర్యాదులు అందచెయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాజమండ్రీ ఆర్డీవో ఆర్ కృష్ణ నాయక్, తహసిల్దార్ ఎన్ లక్ష్మీ లావణ్య, ఎంపిడివో ఝాన్సీ, వి ఆర్ వో లు, రెవెన్యు , పంచాయతీ, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.