-వ్యర్థ పూలతో అగరుబత్తులు యూనిట్ ఏర్పాటు దిశగా అడుగులు
-డి ఆర్ డి ఎ ప్రాజెక్ట్ డైరెక్టర్ మూర్తి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణ పరిరక్షణ, వ్యర్థ పూల నుంచి ఆదాయ వనరుగా యూనిట్ ఏర్పాటు దిశగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి వారి ఆదేశాల మేరకు తునిలో ఏర్పాటు చేసిన అగరుబత్తులు తయారీ యూనిట్ ను సందర్శించడం జరిగిందని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్ వి వి ఎస్ మూర్తి తెలియ చేశారు. మంగళవారం తుని మండలం లోని తిమ్మాపురం గ్రామం గల అగరుబత్తులు తయారీ యూనిట్ ను కడియం మండలంకు చెందిన 40 మంది స్వయం సహాయక మహిళా సభ్యులు తో కలిసి సందర్శించి, అగరుబత్తులు తయారీ విధానాన్ని తెలుసు కోవడం జరిగింది.
ఈ సందర్భంగా పర్యటన వివరాలని ఎన్ వి వి ఎస్ మూర్తి తెలియ చేస్తూ, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యన్నారాయణ స్వామి వారికి అలంకరించిన పూలతో అగరుబత్తీ తయారీ చేసి ఆదాయం సమకూర్చుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడం జరుగుతోంది అని పేర్కొన్నారు. కడియం పూల మార్కెట్ నుంచి ప్రతిరోజూ పెద్ద ఎత్తున నిరుపయోగం గా ఉన్న పూలు బయట పడవేయడం జరుగుతోందని, వాటి నుంచి ఆదాయం సృష్టించి కార్యక్రమాలను నిర్వహించి, స్ధానిక స్వయం సహాయక సంఘాలకు ఆదాయం కల్పించే ఉద్దేశంతో కలక్టర్ సూచనలను అనుసరించి పూల నుంచి అగురబత్తి యూనిట్ ను ప్రత్యక్షంగా సందర్శించినట్లు తెలిపారు. కడియం మండలం కి చెందిన శ్రీ సాయిదేవి, కరుణ, వర సిద్ధి వినాయక గ్రూప్ ల్లోని సభ్యులకు తయారీ విధానాన్ని పోలిమాటి సూరిబాబు అగరు బత్తి తయారీ లోగల వివిధ దశలన్నిటిని వివరించి చెప్పడం జరిగిందన్నారు. అగుర బత్తి ఎలా చెయ్యాలో చేసి చూపించడం జరిగింది. తయారీ ముందుగా పౌడర్ ఎంత పరిమాణం కలపాలో వివరించారు. ముడిసరుకు బెంగుళూరు నుండి ఏవిధంగా సేకరించాలో వివరాలు తెలియ చేశారు. తయారీ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తగు సూచనలు, సలహాలు ఇచ్చి నేర్పించగలనని మహిళలకి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు విధానం పై అడిగిన పలు సందేహాలను నివృత్తి చేయడం జరిగింది.
ఈ క్షేత్ర సందర్శన లో కమ్యూనిటీ కో ఆర్డినేటర్ లు యు జీ బి తిలక్, ఎస్. పద్మారావు, గ్రామ నాయకులు జెల్లి కృపా రావు , చింతపర్తి నాగేశ్వరరావు , కడియం ఎస్ హెచ్ జి సంఘసభ్యులు తదితరులు పాల్గొన్నారు.