-ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 25 వరకు అవకాశం
-యం. సందీప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖల అధ్వర్యంలో ఉచిత డీ ఎస్సీ శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టడం జరిగినదని ఇన్చార్జి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి యం. సందీప్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభావంతులైన పేద ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డీఎస్సీ నందు ఉత్తమ ఫలితాలు పొందేందుకు ప్రభుత్వం ఉచితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రెసిడెన్సీయల్ ప్రాతిపదికన శిక్షణ ఇవ్వనునట్లు టెట్ లో ఉత్తీర్ణులై ఉంటే వారికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి ఆ టెస్టులో 85 శాతం, టెట్ నందు పొందిన మార్కులులో 15 శాతం వెయటేజిని ఇవ్వనున్నట్లు తెలిపారు. వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల లోపు ఉన్న వారిని ఎంపిక చేయడం జరుగు తుందన్నారు .
ఆసక్తీ ఉన్నవారు www.jnanabhumi.ap.gov.in web site నందు నమోదు చేసుకోనుటకు చివరి తేది: 25-10-2024 వరకూ పొడింగించినట్లు , ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరియు శిక్షణ ఎంపిక కోసం అన్ లైన్ స్క్రీనింగ్ టేస్టు నవంబరు 3 వ తేదీన నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధముగా సదరు శిక్షణ ఇచ్చుటకు సమ్మతించు విద్యా సంస్థలు తమ సంస్థ లను ఎనెరోల్ మ్మెంట్ (నమోదు) చేసుకోనుటకు కాల పరిమితిని 25-10-2024 వరకు పొడిగించడం జరిగినది. కావున సదరు శిక్షణ ఇచ్చు విద్యా సంస్థలు ఈ అవకాశంను వినియోగించు కోవలసిందిగా సందీప్ తెలిపారు.