Breaking News

ప్రభుత్వం స్టార్ట్ అప్ పరిశ్రమలకు అన్ని విధాలుగా చేయూతనిస్తోంది

-శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఎన్జీవోలకు ఆధునిక సాంకేతిక డిజిటల్ టెక్నాలజీ పై ఈ నెల 24 నుండి 26 వరకు మూడు రోజుల కార్యక్రమం ప్రారంభం
-మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి : విసి పద్మావతి మహిళా యూనివర్సిటీ ఉమ
-రానున్న కాలమంతా డిజిటల్ టెక్నాలజీ దే… డిజిటల్ ప్లాట్ ఫామ్ వినియోగించుకుని మార్కెటింగ్ పేమెంట్ తదితరాలు సులువుగా చేసుకోవచ్చు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
-మహిళలు పురుషులకు ఏమాత్రం తీసిపోరు: డాక్టర్ కియోంగ్ కో

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనీ, ప్రభుత్వం స్టార్ట్ అప్ పరిశ్రమలకు అన్ని విధాలుగా చేయూతనిస్తోందనీ, రానున్న కాలమంతా డిజిటల్ టెక్నాలజీ దే… డిజిటల్ ప్లాట్ ఫామ్ వినియోగించుకుని మార్కెటింగ్, పేమెంట్ తదితరాలు సులువుగా చేసుకోవచ్చనీ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు విసి పద్మావతి మహిళా యూనివర్సిటీ ప్రొ .ఉమ పేర్కొన్నారు.

గురువారం ఉదయం స్థానిక పద్మావతి మహిళా యూనివర్సిటీ లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ఎన్జీవోలకు ఆధునిక సాంకేతిక డిజిటల్ టెక్నాలజీ పై మూడు రోజుల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, డా. కీయోంగ్ కో మరియు ఇంఛార్జి వైస్ ఛాన్స్లర్ వి.ఉమా, వైస్ చైర్ పర్సన్ APSCHE ప్రో. పీ. ఉమా మహేశ్వరి దేవి, కోర్ మెంబర్ APCICT- వైఫై శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం డీన్ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ప్రొఫెసర్ పి విజయలక్ష్మి, మాజీ విసి ప్రొఫెసర్ వి దుర్గాభవాని తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా విసీ శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ తిరుపతి మరియు యునైటెడ్ నేషన్స్ ఏషియన్ అండ్ పసిఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్ సంయుక్తంగా వైఫై డిఎక్స్ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని నేడు ప్రారంభించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమం ఉమెన్ ఐసిటి ఫ్రంటైర్ ఇనిషియేటివ్ అనేది వైఫై డిఎక్స్ గా నూతనంగా రూపు తీసుకుని మహిళా వ్యాపారవేత్తలుగా డిజిటల్ ప్రపంచంలోకి ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన శిక్షణ సామర్ధ్యాలను అందించేందుకు రూపొందించబడిందన్నారు. భారతదేశంలో ఏకైక ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ సెంటర్ గా 2018 నుండి సుమారు 3000 మందికి పైగా మహిళలకు ఆత్మనిర్భర్ భారత్ అభివృద్ధి చేయడంలో మహిళ యూనివర్సిటీ ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ పేరుతో నిర్వహిస్తున్న వైఫై డిఎక్స్ శిక్షణ ప్రపంచంలోని 18 దేశాలలో అమలు చేశారని, అందులో ఇండియాలో శ్రీ పద్మావతి మహిళా మహిళా యూనివర్సిటీ ఎంపిక కావడం శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ గర్వకారణం అన్నారు. నేడు వైఫై డిఎక్స్ ఎంపవరింగ్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ త్రు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే అంశంపై మహిళా వ్యాపార పారిశ్రామికవేత్తలకు ఇవ్వనున్న ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ పేరుతో నిర్వహించే వైఫై డిఎక్స్ శిక్షణ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. మహిళలు ఈ డిజిటల్ ప్రపంచాన్ని ఎదుర్కొని తాము నిర్వహిస్తున్న వ్యాపారాలను లాభసాటిగా మలుచుకునేందుకు అవసరమైన మెలకువలు వ్యాపార రంగంలో డిజిటల్ వ్యవస్థ వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ ఇవ్వనున్న వారిలో యునైటెడ్ నేషన్స్, థాయిలాండ్, సింగపూర్ ఫిలిప్పీన్స్, కొరియా ట్రైనర్స్ ఎంతో ఉత్తమమైన శిక్షణను ఇవ్వనున్నారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ 19 నేపథ్యంలో మహిళలు అనేక వ్యాపారాలు చేయడానికి ఇబ్బందులు పడ్డారని, ఆ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ పద్ధతులకు ఎక్కువ ప్రాచుర్యం కలిగిందని తద్వారా డిజిటల్ పేమెంట్ పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంది అని, మహిళలకు సదరు వైఫై డిఎక్స్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందని నేటి కాలంలో ఈ – మార్కెటింగ్ ఈ – కామర్స్ ప్లాట్ఫాం లు ఔత్సాహిక మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి ఎంతగానో ఉపకరిస్తుందని తెలిపారు. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ 40 సంవత్సరాల చరిత్ర కలిగి సుమారు 5000 మంది విద్యార్థులకు వివిధ కోర్సులలో విద్యను అందిస్తున్నారని తెలిపారు. మన దేశంలో అత్యంత గొప్ప యువత ఉందని తెలిపారు. ఫిన్ టెక్ తదితర డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వినియోగం ద్వారా, గ్రామీణ మహిళ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కూడా వాట్సాప్ ఇంస్టాగ్రామ్ తదితర డిజిటల్ ప్లాట్ ఫామ్ ల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారని అన్నారు. హ్యాండీక్రాఫ్ట్స్, చేనేత, ఆహార పదార్థాలు తదితర ఉత్పత్తులను డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా అమ్మకాలు మహిళలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఆశించడమే కాకుండా తాము పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2016 సంవత్సరంలోనే స్టార్ట్ అప్ లను ప్రారంభించడానికి చర్యలు చేపట్టారని తెలిపారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని అన్నారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఎప్పుడు టెక్నాలజీనీ విస్తృతంగా వాడడం ద్వారా పలు సేవలు పారదర్శకంగా నాణ్యతగా చేపట్టవచ్చని చెబుతుంటారు అని,మన ముఖ్యమంత్రి హైదరాబాద్ నగరాన్ని ఐటి హబ్ గా తీర్చిదిద్దిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మన రాష్ట్రంలోని అమరావతి ఐటీ హబ్ గా, అలాగే తిరుపతిని ఎలక్ట్రానిక్ గా హబ్ గా తీర్చిదిద్దనున్నారు అని తెలిపారు. విసీ గారి సూచనలు మన జిల్లా విజన్ డాక్యుమెంట్ ఐదు సంవత్సరాలకు సంబంధించిన ప్రణాళిక మరియు 2047 సం. ప్రణాళిక రూపొందించడానికి ఎంతగానో ఉపకరించిందని తెలిపారు. జిల్లాలో 7 స్కిల్ హబ్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వము కొత్తగా చేపట్టనున్న స్టార్ట్ అప్ లకు అన్ని విధాలుగా చేతనిస్తోందని మనం చేయవలసిందల్లా మనకు ఆసక్తి కలిగిన స్టాప్ ను ఎంచుకొని ప్రారంభించాల్సి ఉంటుందని, నేటి శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు

డాక్టర్ కియోంగ్ కో మాట్లాడుతూ సమాజంలో మహిళల పాత్ర చాలా ప్రముఖమైనదని, ఒక గృహంలో మహిళ తన కుటుంబానికి మార్గదర్శకురాలుగా నిర్ణయాలు తీసుకుంటుందని, మహిళలు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని తాను నమ్ముతున్నానని, మగవారికి ఏమాత్రం మహిళలు తీసిపోరని, ఈ కార్యక్రమంలో తాను పాలుపంచుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నానని తెలిపారు.

కార్యక్రమానంతరం రెండు పుస్తకాలను విడుదల చేశారు. ప్రారంభో ఉపన్యాసం ప్రొఫెసర్ పి విజయలక్ష్మి చేయగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్. రజనీ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పలువురు ముఖ్య అతిథులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

విఎంసి సిబ్బందికు సాంకేతిక పరిజ్ఞానం పెంచేందుకు శిక్షణ కార్యక్రమం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *