Breaking News

మహిళా ఉద్యోగులు పనిచేసే కార్యాలయాలలో రక్షణ కల్పించాల్సిన భాద్యత సంబందిత అధికారులదే…

-ఏపిజేఏసి అమరావతి రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ జెనరల్ పొన్నూరు విజయలక్ష్మి & అసోసియేట్ చైర్ పర్సన్ సైకం శివకుమార్ రెడ్డి విజ్ఞప్తి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని విభాగాలలో పనిచేస్తున్న అన్ని డిపార్టుమెంట్ లలో పనిచేసే మహిళా ఉద్యోగులకు వారి విధినిర్వాహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా,సహచర ఉద్యోగులతో వేదింపులు లేకుండా చూడాల్సిన బాద్యత సంబందిత కార్యాలయాలలో పనిచేస్తున్న అధికార్లే మహిళా ఉద్యోగులకు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఏపిజేఏసి అమరావతి రాష్ట్రకమిటి ఆద్వర్యంలో పనిచేస్తున్న రాష్ట్ర మహిళా విభాగం సెక్రటరీ జెనరల్ పొన్నూరు విజయలక్ష్మి,స్టేట్ అసోషియేట్ చైర్ పర్సన్ సైకం శివకుమారిరెడ్డి విజ్ఞప్తి చేసారు.

గురువారం తిరుపతి కలెక్టరేట్ లో ఏపిజెఏసి అమరావతి తిరుపతి జిల్లా చైర్మన్ గోపినాధ్ రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా ఏపిజేఏసి మహిళా విభాగం చైర్ పర్సన్  పి. సంధ్యారాణి అధ్యక్షతన,జిల్లా మహిళా జెనరల్ సెక్రటరీ పద్మజ ఆద్వర్యంలో జరిగిన తిరుపతి జిల్లా స్దాయి ఉమెన్ ఎంప్లాయీస్ కమిటి సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న స్టేట్ సెక్రటరీ జెనరల్  పొన్నూరు విజయలక్ష్మి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగుల సమస్యలు పై ఏ ఒక్క జేఏసి నాయకులు ఉద్యమ బాటపట్టేందుకు ముందుకు రాకుండా వెనకడుగు వేసినప్పటికీ రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యయ,కార్మిక,కాంట్రాక్టు & ఔట్ సోర్శీంగు ఉద్యోగులు సమస్యలు,ఉమెన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం,ఉద్యోగులకు రావల్సిన భకాయిల కోసం 92 రోజులు ఉద్యమం చేసి ఉద్యోగులకు సంబందించిన ఆర్దిక,ఆర్దికేతర సమస్యలు పరిష్కారం కోసం కృషి చేసింది ఒక్క ఏపిజేఏసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాత్రమేనని విజయలక్ష్మి తెలిపారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మరో ముఖ్యఅతిధి ఏపిజేఏసి అమరావతి ఉమెన్ కమిటి స్టేట్ అసోషియేట్ చైర్ పర్సన్ సైకం శివకుమార్ రెడ్ఢి మాట్లాడుతూ మహిళలను ఇబ్బందులను తెలియ పర్చేందుకు అన్ని జిల్లాకలెక్టర్సు కార్యాలయాలలో షీ బాక్సులు ఏర్పాటు చేయించాలని, అలాగే ఉమెన్ ఉద్యోగులు పనిచేస్తున్న అన్ని కార్యాలయాలలో ఉమెన్ ప్రోటక్షన్ సెల్సు ఏర్పటుచేయాలని, అన్ని కార్యాలయాలలో మహిళాఉద్యోగులకు కనీస వసతలు కల్పించేలా ఆయా డిపార్టుమెంట్లుకు చెందిన అధికార్లు బాద్యతలు తీసుకొనేలా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో జిల్లాకలెక్టర్సును జిల్లా ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం ఆద్వర్యంలో కలసి విజ్ఞప్తులు చేస్తున్నామని సైకం శివకుమారి రెడ్డి అన్నారు.

డివిజన్ స్దాయి ఏపీజేఏసీ అమరావతి మహిళా విభాగం కమిటీలు ఎంపిక
చిత్తూరు జిల్లాల్లో 4 డివిజన్లు తిరుపతి, శ్రీకాళహస్తి గూడూరు, సూళ్లూరుపేట డివిజనుల కమిటీలు ఉండగా తిరుపతి డివిజన్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అలాగే మహిళా ఉద్యోగులపై సెక్సువల్ harasment విషయమై పిర్యాదు చేయుటకు ‘షీ బాక్స్’ ను కలెక్టరెట్ నందు ఏర్పాటు చేయనిమిత్తం తిరుపతి జిల్లా కలెక్టర్ Dr వెంకటేశ్వర్ కి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర మహిళా విభాగం వారితో కలసి జిల్లా మహిళా కార్యవర్గం రిప్రెసెంటేషన్ మరియు ‘ షీ బాక్స్ ‘ ను కూడా ఇవ్వడం జరిగింది.

Check Also

ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు

-రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పునరుత్పాదక రంగంలో ప్రాజెక్టులు -రూ.1,87,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం -వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *