-కార్పొరేషన్ లో ఘన నివాళులు అర్పించిన విఎంసి సిబ్బంది
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన జయంతి సందర్భంగా గురువారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద నిర్వహించిన నివాళుల కార్యక్రమంలో పాల్గొన్న అడిషనల్ కమిషనర్ (ప్రాజెక్ట్ ) డాక్టర్ డి.చంద్రశేఖర్ అన్నారు.
ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలో సంస్థలు విలీనం కావడానికి గట్టి కృషి చేసిన వ్యక్తి ఆయనని అన్నారు. 1910 లో ఇంగ్లాండ్ లో బారిష్టర్ పట్టా పట్టుకున్న ఆయన రాజ్యాంగ రచనలో పాలుపంచుకున్నారని తెలిపారు. జవహర్లాల్ నెహ్రూ నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కేంద్రమంత్రి మండలి ఉప ప్రధానిగా చేశారని తెలిపారు. ఐక్యతకు నిదర్శనమైన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రీయ ఏక్తా దివస్ జరుపుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి భావితరాలకు తెలియజేసేలా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమని అన్నారు. తదుపరి విజయవాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ ( ప్రాజెక్ట్స్) డాక్టర్ డి చంద్రశేఖర్ రాష్ట్రీయ ఏకతా దివస్ సందర్భంగా సిబ్బందితో రాష్ట్రీయ ఏకతా దివస్ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా మానేజర్ ఏయూబీ శర్మ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మొదటి భారతీయ మున్సిపల్ కమిషనర్ గా పనిచేశారని అహ్మదాబాద్ లో 1917 నుండి 1924 వరకు మున్సిపల్ కమిషనర్ గా సేవలందించారని, బ్రిటిష్ ఇండియా విధించిన పన్నులను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆయన చేపట్టిన కిసాన్ ఉద్యమంలో ఆయనకి సర్దార్ అన్న బిరుదు వచ్చిందని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 182 మీటర్ల ఎత్తైన విగ్రహంను నర్మదా నది తీరంలో గుజరాత్లో స్థాపించి, ఐక్యతకు మారుపేరైన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుర్తించారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణ, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ రజియా షబీన, ఇతర విఎంసి సిబ్బంది పాల్గొని నివాళులు అర్పించారు.