Breaking News

కరోనా నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తాం… : కలెక్టర్ జె. నివాస్

-అతిక్రమిస్తే జరిమానాలు తప్పవు…
-రద్దీ ప్రాంతాలలో 144వ సెక్షన్ అమల్లో వుంటుంది…
-థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సర్వం సన్నద్ధం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోనా వైరస్ విజృంభణ కొంత మేరకు తగ్గినప్పటికి ప్రజలు అప్రమత్తతతో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నిబంధనలను అతిక్రమిస్తే జరిమానాలు తప్పవని జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు. థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉందన్నారు. కోవిడ్ – 19 కట్టడికి తీసుకున్న చర్యలు అవగాహన కార్యక్రమాల నిర్వహణ నిబంధనలు అమలు తదితర అంశాలపై స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ జి. నివాస్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ నిబంధనలను కఠినతరంగా అమలు చేయడం వలన వైరస్ వ్యాప్తిని అరికట్టగలిగామన్నారు. కోవిడ్ వ్యాప్తి తీవ్రత తగ్గిన్నపట్టికి ప్రజలు అప్రమత్తతతో ఉండి నిబందనలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ప్రజలను చైతన్య పరచడంలో మీడియా సహకారం కీలకమన్నారు. రద్దీ ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నమన్నారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే విధంగా ఎవరు వ్యవహరించిన ఉపేక్షించబోమని తెలిపారు. మాస్కు ధరించడం తప్పని సరి చేశామని మాస్కు ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే జరిమానా విధించమని పోలీస్ వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. కోవిడ్ పై ప్రజలను మరింత చైతన్యవంతులను చేసేందుకు పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సోమవారం ప్రభుత్వ కార్యాలయాల వద్ద “మాస్క్ లేనిదే – ప్రవేశం లేదు” మంగళవారం “నో మాస్క్నో రైడ్ ” బుధవారం రద్దీ ప్రాంతాలు మార్కెట్లు, షాపింగ్ మాల్స్ వద్ద “నో మాస్క్ – నో సెల్” నినాదలతో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మూడు నెలల పాటు కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికను రూపొందించడం జరిగిందన్నారు. కరోనా నిబంధనలను అతిక్రమించే షాపు, మాల్స్ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు బారీ జరిమానాలు విధించి అవసరమైతే ఆయా షాపులను సీజ్ చేసేందుకు
వెనుకాడేది లేదన్నారు. కోవిడ్ టెస్టులు : జిల్లాలో ఇంతవరకు 18,79,652 కోవిడ్ టెస్టులు నిర్వహించగా వాటిలో 1,04,168 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 2,753 యాక్టవ్ కేసులు ఉన్నాయన్నారు. కోవిడ్ టెస్టులను ప్రతిరోజు 8 వేలకు తగ్గకుండా నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతీ ఏహెచ్ సిలో టెస్టులు జరుగుతున్నాయన్నారు. జిల్లాలో పాజిటివ్ రేట్ 5 శాతం కన్న తక్కువగా ఉన్నప్పటికి తెలంగాణ రాష్ట్ర ప్రాంత సరిహద్దు మండలాలైన జగ్గయ్యపేట, వత్సవాయి, నందిగామ, తిరువురు, గంపలగూడెం మండలాల్లో కేసుల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. ఆయా మండలాలో ప్రత్యేక దృష్టి పెట్టి వైరస్ నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. కరోనా కట్టడిలో భాగంగా గ్రామ స్థాయిలో ఫీవర్ సర్వే నిర్వహించి అనుమానిత లక్షణాలు ఉన్న వారిని గుర్తించి, టెస్టులు నిర్వహించి అవసరమైన వారికి తక్షణమే వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నామన్నారు. వ్యాక్సినేషన్ : కృష్ణాజిల్లాలో ఇంతవరకు 16,40,705 మందికి కోవిడ్ టీకాలు వేయడం జరిగిందన్నారు. వీరిలో 13,03,217 మంది కోవీషిల్డ్ టీకా పొందగా 3,37,488 మంది కోవ్యాక్సిన్ టీకా పొందరన్నారు. ఈ పాధ్యాయులందరికి వ్యాక్సినేషన్ అందించబోతున్నామన్నారు. 5 సంవత్సరాలలోపు పిల్లలు కలిగిన 1,74,089 తల్లులకు కోవిడ్ టీకాలు వేశామన్నారు. ప్రత్యేకంగా 36,918 మంది గర్భిణీలను గుర్తించి వారికి టీకాలు అందించే కార్యక్రమాలు చేపట్టమన్నారు. ఈ చిన్నపిల్లల వైద్యానికి ప్రత్యేక ఏర్పాట్లు : థర్డ్ వేవ్ సంభవిస్తే పిల్లలపై ఎక్కువ ప్రభావం వుంటుందన్న నేపథ్యంలో వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. పాత జిజిహెలో 100 పడకలతో, మచిలీపట్నం జిజిహెచ్ లో ప్రత్యేక పడకలతో చిన్నపిల్లల వైద్యానికి ఏర్పాట్లు చేశామన్నారు. వైద్యం అందించేందుకు అవసరమైన పరికరాలు, మౌలిక సదుపాయలతోపాటు చిన్నపిల్లలకు అవసరమైన మాస్కులను కూడా సిద్ధం చేస్తున్నమన్నారు. చిన్నపిల్లల వైద్యానికి అవసరమైన శిక్షణను నర్సులకు, డాక్టర్లకు అందించే కార్యక్రమం ప్రారంభమయిందన్నారు. అవసరమైన వైద్యులు వైద్యసిబ్బంది నియమకాలకు చర్యలు తీసుకున్నామన్నారు.

Check Also

దేశ డ్రోన్ రాజ‌ధానిగా ఏపీని తీర్చిదిద్దుతాం

-ఓర్వకల్లు ఇండస్ట్రియల్ పార్కులో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తాం. -రాష్ట్రంలో 35 వేల మంది డ్రోన్ పైలట్లకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *