విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కరోన కారణంగా ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, అది ప్రతిఒక్కరి బాధ్యతగా గుర్తించుకోవాలని ఆర్టీఓ యం పద్మావతి పేర్కొన్నారు. నందిగామలోని పాత బైపాస్ రోడ్డు దగ్గర మంగళవారం నాడు డిటీసీ యం పురేంద్ర ఆదేశాల మేరకు మాస్క్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న, ప్రయాణిస్తున్న ప్రయాణికులకు కోవిడ్ పై అవగాహన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ యం పద్మావతి మాట్లాడుతూ కోవిడ్ ను నియంత్రించాలంటే మాస్కును ధరించడం భౌతిక దూరం పాటించడం వంటివి కీలక అంశాలని అన్నారు. మాస్క్ ధరించకుండా వాహనాలు డ్రైవింగ్ చేయవద్దని, మాస్క్ ను తప్పని సరిగా ధరించాలని నిర్లక్ష్యం వహించవద్దని ఆమె అన్నారు. ప్రజల్లో కోవిడ్ పై మరింత అవగాహన కలిగించేందుకు డ్రైవర్ల కు కౌన్సిలింగ్ ఇస్తున్నామని అన్నారు. ప్రయాణికులను చేరవేసే బస్సులు,ఆటోలు, క్యాబ్ లు నడిపే డ్రైవర్లు మాస్కులు ధరించడమే కాకుండా వాహనాలలో ఎక్కే ప్రయాణికులు కూడా మాస్కులు దరించేలా చూడాలన్నారు. ప్రజల్లో కోవిడ్ పై అవగాహన పెంపొందించేందుకు కరపత్రాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. మాస్క్ దరించని వారికి మాస్క్ లను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మోటార్ వాహన తనిఖీ అధికారి అయేషా ఉస్మాని, రవాణాశాఖ ఉద్యోగుల సంఘం జోనల్ అధ్యక్షుడు యం రాజుబాబు, కానిస్టేబుళ్లు, హోమ్ గార్డులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …