Breaking News

మూడో వేవ్ ప్రచారం నేపథ్యంలో కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు-మాస్కు ధరిద్ధాం వైరస్ ను ఎదుర్కొందాం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత కొంతకాలంగా కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతూ వస్తోంది. మే 15 నుంచి జూన్‌ 20 వరకు దేశంలో కరోనా కేసులు తగ్గుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ కరోనా ఆంక్షలు సడలిస్తున్నారు. మన రాష్ట్రంలోనూ ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే కేసుల సంఖ్య మన రాష్ట్రంలో కేసులు తగ్గుముఖం పడుతున్నా… దేశంలోని కేరళ, మహారాష్ట్రసహా పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో మూడో వేవ్ కూడా వచ్చే ప్రమాదం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం నిర్దేశించిన నియమాల ప్రకారం వ్యాక్సిన్ తీసుకోవడంతోపాటు మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటిచడం, చేతులను సబ్బుతో లేదా శానిటైజర్ తో శుభ్రంగా కడుక్కోవడం మాత్రం మర్చిపోకూడదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ పనుల మీద బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం ద్వారా కరోనా వ్యాప్తిని చాలా వరకు అరికట్టవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనల్లో సడలింపులు ఇవ్వడంతో ప్రజలు రోజువారీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. ఈ సమయంలోనే కరోనా వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మర్చిపోతున్నారు. కరోనాను ఎదుర్కోవడంలో మనవంతు బాధ్యతను నిర్వర్తిద్దాం.. కరోనాను ధైర్యంగా ఎదుర్కొందాం. కరోనాతో జరిగే యుద్ధంలో విజయం సాధిద్దాం

1) మాస్క్ తప్పనిసరిగా ధరించాలి?

కోవిడ్-19 వైరస్ ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినపుడు గానీ, దగ్గినపుడు గానీ ద్రవరూపంలో ఉండే తుంపర్లు గాలి ద్వారా ఎదుటివారి మీద పడే అవకాశం ఉంటుంది. మరికొందరిలో శ్వాసకోస వ్యవస్థలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అదే మనం మాస్కు ధరిస్తే వైరస్ మన శ్వాసవ్యవస్థలోకి ప్రవేశించే అవకాశాలను తగ్గిస్తుంది. అందుకే ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కు ధరించాలి.

2) టిఫిన్, టీ, ఫ్రూట్ జ్యూస్ సెంటర్ల దగ్గర ఎప్పటిలాగే తీవ్రమైన రద్దీ ఉంటోంది. ఎక్కడా కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు పెట్టుకున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవడంలేదు. ఫ్యాషన్ గా మాస్కులు ముఖానికి తగిలించుకుని నిర్లక్ష్యంగా ఉంటున్నారు.

3) కరోనాకి ఎవరూ అతీతులు కాదు. రాబోయే రోజుల్లో కరోనా బారినపడేవారి సంఖ్య మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. మనవరకు రాలేదని, ఒకవేళ కరోనా వచ్చిపోయినా అజాగ్రత్తగా మాత్రం ఉండకూడదు. అది మన బాధ్యతారాహిత్యాన్ని తెలియచేస్తుంది.

4) కరోనా అనేది సాధారణ వ్యాధుల్లా పరిగణించి బయట తిరగకూడదు. ఉద్యోగ రీత్యా, ఇతర పనుల కోసం బయటకు వెళ్లినా కరోనా సోకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు పెట్టుకోవాలి.

5) సాధ్యమైనంత వరకు చిన్న పిల్లల్ని బజారుకి, మార్కెట్లకు, రద్దీగా ఉండే ప్రదేశాలకు పంపకండి.

Check Also

జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసిన తిరుపతి రుయా ఆసుపత్రి సీఎస్ ఆర్.ఎం.ఒ డాక్టర్ బి.సుబ్బలక్ష్మమ్మ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : రుయా ఆసుపత్రి సిఎస్ఆర్ఎంఓ గా బాధ్యతలు చేపట్టిన అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *