Breaking News

దత్తత డివిజన్ పై గద్దె శీతకన్ను : దేవినేని అవినాష్


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఈ 15 వ డివిజన్ ని దత్తత తీసుకున్నాను అని ఆర్భాటంగా ప్రకటించిన అప్పటి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ డివిజన్ అభివృద్ధి కి చేసింది శున్యం అని, అందుకే ప్రజలు ఎక్కడ తిరగబడితారో అనే భయంతో మొన్న జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో అభ్యర్థిని కూడా నిలబెట్టలేదని వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శలు చేశారు. బుధవారం 15 వ డివిజన్ రామలింగేశ్వర నగర్ నందు డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ గారితో కలిసి పర్యటించిన అవినాష్ అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేశారు.అదేవిధంగా ఇంటి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెద్ద ఎత్తున నిధులు తెచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నామని,కులమత పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దే అని అన్నారు. ఆ నమ్మకం తోనే ప్రతిపక్షాలు అన్ని ఏకమై ఎన్ని కుట్రలు పన్నిన సరే ఈ డివిజన్ లో వైస్సార్సీపీ అభ్యర్థి బెల్లం దుర్గ కు ప్రజలు ఘన విజయం కట్టబెట్టారని గుర్తు చేశారు.ఆ నమ్మకం నిలబెట్టుకునే విధంగా డివిజన్ ని అభివృద్ధి చేసి చూపిస్తామని, ప్రజలకు ఏ కష్టం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. గత ప్రభుత్వం లో గద్దె దత్తత తీసుకున్న అని ప్రకటన తప్ప అభివృద్ధి కి తీసుకొన్న చర్యలు ఏంటని ప్రశ్నించారు. మీరు నిర్మించిన నాసిరకం రిటైనింగ్ వాల్ వలన మురుగు నీరు చేరి స్థానికులు ఇబ్బందులు పడుతుంటే అప్పటికప్పుడు లాక్ సిస్టం ఏర్పాటు చేసి మురుగు నివారణకు చర్యలు తీసుకున్నామని,రిటైనింగ్ వాల్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చేపడతానని తెలిపారు. స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు, సీనియర్ నాయకులు ఆళ్ల చల్లారావు గారు కార్పొరేటర్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని, మళ్ళీ నేడు వైస్సార్సీపీ ప్రభుత్వం లొనే అభివృద్ధి పనులు చేపడుతున్నమని తెలిపారు. ఇటీవల 20 లక్షల రూపాయల తో ఇంటి ఇంటికి మంచినీటి కుళాయిలు ఏర్పాటు కు శంకుస్థాపన చేశామని,మళ్ళీ నేడు అనేక అంతర్గత రోడ్డు నిర్మాణలకు,డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని, వైస్సార్సీపీ నాయకుల పర్యవేక్షణ లో ఎలాంటి నాణ్యత లోపం లేకుండా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే మాట్లాడుతూ పెన్షన్ పెంపు గురుంచి ప్రభుత్వన్ని ప్రశ్నిస్తున్నారు అని గతంలో లాగా మేము ఎన్నికల కోసం మీలాగా హడావుడిగా పెంపు చేయలేదు అని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే మొదట సంతకం పెన్షన్ పెంపు ఫైల్ మీద చేసి 2250 రూపాయలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ దే.. మీ ప్రభుత్వం లో లాగా కార్యాలయలాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగి లంచాలు ఇచ్చే పని లేకుండా ఒకటో తేదీ ఉదయాన్నే ఇంటి వద్దనే అందిస్తూన్నాం. ఒక్కసారి ఆ జూమ్ ఆప్ నుండి బయటకు వస్తే ఆ పెన్షన్ తీసుకొనే మహిళలే మీకు సమాధానం చెబుతారని , ఇంకోసారి మీ రాజకీయ మనుగడ కోసం ప్రచార ఆర్భాటాల కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వి.ఎమ్.సి అధికారులు, రాము, బాలాజీ, ఈశ్వర్, బాబీ, కొండా, చిన్న,బాబులు , కాము తదితరలు పాల్గొన్నారు.

Check Also

వరద బాధితులకు విరాళాల వెల్లువ

-సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : అనూహ్య వరదలతో నిర్వాసితులైన బాధితులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *