గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ గురువారానికి, ఎన్పీసిఐ అప్ లోడ్ శుక్రవారానికి పూర్తి చేయాలని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ స్పష్టం చేశారు. బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో నోడల్ అధికారులతో నగరంలో జియో ట్యాగ్, ఎన్పీసిఐ అప్ లోడ్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో వార్డ్ సచివాలయ కార్యదర్శుల ద్వారా చేపడుతున్న హౌస్ హోల్డ్ జియో ట్యాగ్ మ్యాపింగ్ ని గురువారం సాయంత్రానికి పూర్తి చేసేలా నోడల్ అధికారులు సచివాలయాల వారీగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. అలాగే బ్యాంక్ అకౌంట్స్ పై చేపడుతున్న ఎన్పీసిఐ అప్ లోడ్ శుక్రవారానికి పూర్తి చేయాలన్నారు. నోడల్ అధికారులు కూడా ఆయా యాప్ లను డౌన్లోడ్ చేసుకొని, క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. నిర్దేశిత గడువు మేరకు పూర్తి కావడానికి భాద్యత తీసుకోవాలన్నారు. అలాగే క్షేత్ర స్థాయి విధుల్లో అలసత్వంగా, నిర్లక్ష్యంగా ఉండే సచివాలయ కార్యదర్శులపై నివేదిక ఇవ్వాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ డి.శ్రీనివాసరావు, డిఎల్డీఓ పిచ్చిరెడ్డి, ఉపా సెల్ పిఓ రామారావు, మేనేజర్ బాలాజీ బాష, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
పేదల, ప్రజల మనిషి ఎమ్మెల్యే గద్దె రామమోహన్
-సీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.17.50 లక్షల విలువైన చెక్కులను అందచేసిన నాగుల్‌మీరా, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త …