-జగనన్న హయంలో ప్రజల వద్దకు పాలన
-దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతిపక్షాలు ప్రచారం కోసమే..ఆస్తిపన్నుపై వివాదం చేస్తున్నాయి అని, పేద ప్రజలకు ఇబ్బంది లేని పన్ను విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిమరియు అధికారులతో కలిసి 42వ డివిజనులో ఆర్.టి.సి.వర్క్ షాపు రోడ్డు, టెలిఫోన్ కాలనీ రోడ్డు, రైతు బజారు రోడ్డు, మసీదు రోడ్డు, రేపాకువారి వీధి, నేతాజీ రోడ్డు మీదుగా కుండల బజారు, పాత HB కాలనీ తదితర ప్రాంతాలు పర్యటించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి హయంలోనే విజయవాడ అభివృద్దికి నిధులు కెటాయింపు జరుగుతుందని, మాజీ సిఎం చంద్రబాబునాయుడు విజయవాడపై సవతి ప్రేమ చేపెడుతున్నారన్నారు. ఆస్తి పన్నుపై కొత్త జీవో కారణంగా పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. పన్ను విధానం పాదర్శకంగా ఉంటుందన్నారు. చంద్రబాబు హయంలో నగర పాలక సంస్థ నిధులును కూడా మళ్లించిన ఘనత వారికే దక్కుతుందన్నారు. జగనన్న హయంలో క్లీన్ విజయవాడగా దర్శనం ఇవ్వబోతుందన్నారు. అందులో భాగంగా ప్రతి ఇంటి చెత్త సేకరణ, స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజలకు అండగా, వారి పక్షన పనిచేయడమే జగనన్న విధానం అన్నారు. అదే విధంగా పశ్చిమ నియోజకవర్గంలో రహదారుల అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నాయి అని తెలిపారు. నియోజకవర్గంలో పార్క్‌లను కూడా అభివృద్ది చేయడంతో పాటు ప్రత్యేకంగా నగరంలో మొక్కలను నాటుతున్నట్లు వివరించారు.
నగరాభివృద్ది కృషి : మేయర్…
సీఎం జగన్‌మోహన్ రెడ్డి హయంలో విజయవాడ నగరాన్ని సుందరంగా అభివృద్ది చేస్తామన్నారు. మంత్రి
వెలంపల్లి శ్రీనివాసరావు సహకారంతో ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పర్యటనలో మేయర్ రాయన భాగ్య లక్ష్మి, 42 వ డివిజన్ కార్పొరేటర్ పడిగపాటి చైతన్యరెడ్డి, నాయకులు, కార్యకర్తలు వివిధ విభాగాల అధికారుల ఉన్నారు.